
బీజేపీ చీఫ్ అమిత్ షా (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : నోరు జారి అడ్డంగా బుక్కైన భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. తన వ్యాఖ్యలపై స్పందించారు. యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా పేర్కొనటం తన పొరపాటే అని షా పేర్కొన్నారు.
శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ‘సిద్ధరామయ్య ప్రభుత్వం అనబోయి పొరపాటున యాడ్యురప్ప అని నేను అన్నాను. అవును.. నేను తప్పు చేశా. కానీ, కర్ణాటక ప్రజలు మాత్రం తప్పు చెయ్యబోరు. బీజేపీకి పట్టం కట్టి కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడతారు’ అని చెప్పారు.
కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ షా పొరపాటున యెడ్డీ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా పేర్కొనటం.. వెంటనే సవరించుకుని ఆయన సిద్ధరామయ్య అని చెప్పటం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆ వీడియోను వైరల్ చేసి షాను ట్రోల్ చేసి పడేసింది. ఇక దేవనగరి జిల్లాలో బహిరంగ సభలో అనువాదకుడి మూలంగా మరోసారి షా మళ్లీ పప్పులో కాలేశారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరుగనున్నాయి. మే 15న ఫలితాలు వెవడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment