చామరాజపేటేలో చమక్కు | Zameer to contest from Chamarajpet as Cong man | Sakshi
Sakshi News home page

చామరాజపేటేలో చమక్కు

Apr 8 2018 8:08 AM | Updated on Mar 18 2019 7:55 PM

Zameer to contest from Chamarajpet as Cong man - Sakshi

కేజీఎఫ్‌: ప్రధాని నరేంద్రమోది, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. శనివారం నగరంలోని మున్సిపల్‌ మైదానంలో  ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని బీజేపీని దుమ్మెత్తి పోశారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోది ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. ప్రతి పౌరుడి ఖాతాలోకి 15 లక్షలు వేస్తానని లేని పోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.దేశంలో 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నిరుద్యోగులకు ఆశలు కల్పించి వారి ఆశలను అడియాశలు చేశారని ఆరోపించారు. 

అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతుల అప్పులను మాఫీ చేయడంలో పూర్తిగా నిర్ల„ýక్ష్యం వహించారన్నారు. బ్యాంకులను మోసం చేసిన వారు కళ్లెదురుగా విదేశాలకు పారిపోతుంటే చూస్తూ ఉన్నారని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి మొక్కే నరేంద్రమోది దళితులపై దౌర్జన్యాలను అరికట్టలేక పోతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు ఇది వారి మానసిక స్థితిని తెలియ జేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు దళితుల ఇంట్లో టిఫిన్‌ చేస్తున్నామని తెలిపి హోటల్‌ నుంచి తెప్పించుకుని తింటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. 

కేంద్రంలో మంత్రులు మీయూష్‌గోయల్‌ తదితరులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారన్నారు. రైతుల 8 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం ద్వారా రైతు పక్షపాతి అని నిరూపించుకుంద,ని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీనే మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం సిద్దరామయ్య, కేపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి కేసి వేణుగోపాల్, కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లిఖార్జున ఖర్గే,డీ కే శివకుమర్,  లోక్‌సభసభ్యుడు రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement