ప్రేమ వేధింపులకు బాలిక బలి  | girl died in mysure | Sakshi
Sakshi News home page

ప్రేమ వేధింపులకు బాలిక బలి 

Published Wed, Jan 3 2018 7:14 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

girl died in mysure

సాక్షి, మైసూరు: ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16) పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు.

తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి సతాయించేవాడు. ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరిచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనిని కే.ఆర్‌.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేయగా ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి అప్పటినుంచి పరారీలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement