వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి | Agriculture Officer Cheats Woman In Name Of Love At Mysuru | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి

Published Mon, Jul 18 2022 2:39 PM | Last Updated on Mon, Jul 18 2022 3:00 PM

Agriculture Officer Cheats Woman In Name Of Love At Mysuru - Sakshi

సాక్షి, బెంగళూరు: మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచన చేసిన వ్యవసాయ శాఖ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణ తాలూకా బెట్టదపుర సమీపంలో చోటుచేసుకుంది. ఇక్కడి రైతు సమాచార కేంద్రంలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న వికాస్‌పై కేసు నమోదు చేశారు. 2019లో పిరియా పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేసే మహిళతో వికాస్‌ పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నట్లు నటించి లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్బం దాల్చగా అబార్షన్‌ చేయించాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు పోలీసుల ఎదుట వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   
చదవండి: జీన్స్‌ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement