ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్‌లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.
ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్‌జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్‌లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్‌జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.
Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI
— Infosys (@Infosys) June 12, 2024
Comments
Please login to add a commentAdd a comment