top brand
-
భారత్‌లోనే విలువైన బ్రాండ్
భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌ల్లో టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్ ర్యాంకింగ్స్ టైటిల్‌ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్‌కు దక్కించుకున్న టాటా గ్రూప్ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూప్, ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్‌షిప్‌లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో వెస్ట్‌సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది. -
వరల్డ్ టాప్ 100 బ్రాండ్లలో ఇండియన్ కంపెనీలు
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఇండియా నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) 46వ ర్యాంక్ పొందగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 47 ర్యాంక్ పొందింది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ జాబితాలో 73 ర్యాంక్ సొంతం చేసుకుంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 74 ర్యాంక్ కైవసం చేసుకుంది.ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ సంస్థ స్థానం పొందటం ఇది వరుసగా మూడోసారి. బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్‌గా ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ పొందింది.ఇండియాలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఇన్ఫోసిస్ టాప్ 6 శాతంలో ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ డేటా వెల్లడించింది. రెండు మార్కెట్లలో ఇన్ఫోసిస్ విశ్వసనీయ భాగస్వామిగా దాని స్థానాన్ని సుస్థిరం చేయడం ద్వారా దాని వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉందని కాంటార్ బ్రాండ్జెడ్ అధిపతి మార్టిన్ గెరియేరియా అన్నారు.Infosys featured as a Top 100 global brand by Kantar! Thank you to every Infoscion, for making this happen for the 3rd consecutive year! https://t.co/MSaxBOIy1x#NavigateYourNext #KantarBrandzTop100 #InfyNews pic.twitter.com/zGe99AWfeI— Infosys (@Infosys) June 12, 2024 -
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి. 1. యాపిల్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు. సీఈఓ: టిమ్‌కుక్ కంపెనీ ప్రారంభం: 1976 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 2. మైక్రోసాఫ్ట్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు. సీఈఓ: సత్యనాదెళ్ల కంపెనీ ప్రారంభం: 1975 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 3. సౌదీ అరమ్‌కో సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు. సీఈఓ: అమిన్ హెచ్.నజెర్ కంపెనీ ప్రారంభం: 1933 ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! 4. ఆల్ఫాబెట్(గూగుల్) సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు. సీఈఓ: సుందర్ పిచాయ్ కంపెనీ ప్రారంభం: 1998 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 5. అమెజాన్ సెక్టార్: ఈ కామర్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు. సీఈఓ: యాండీ జెస్సీ ఫౌండర్: జెఫ్‌బెజోస్ కంపెనీ ప్రారంభం: 1994 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 6. ఎన్విడియా సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు. సీఈఓ: జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రారంభం: 1993 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 7. మెటా ప్లాట్‌ఫామ్స్(పేస్బుక్) సెక్టార్: సోషల్ మీడియా మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు. సీఈఓ: మార్క్ జూకర్బర్గ్ కంపెనీ ప్రారంభం: 2004 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ 8. బెర్క్‌షైర్ హాత్వే సెక్టార్: ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు. సీఈఓ: వారెన్‌బఫెట్ కంపెనీ ప్రారంభం: 1839 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 9. టెస్లా సెక్టార్: ఆటోమోటివ్ మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు. సీఈఓ: ఎలాన్‌మస్క్ కంపెనీ ప్రారంభం: 2003 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 10. ఎలి లిల్లి సెక్టార్: ఫార్మాసూటికల్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు. సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్ కంపెనీ ప్రారంభం: 1876 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ -
సత్తా చాటుకున్న రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పటిష్టమైన టెలికం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అగ్రస్థానం దక్కించుకుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. 2022కి సంబంధించి భారత్‌లో అత్యధికంగా ఇష్టపడే పటిష్టమైన బ్రాండ్స్ అంశంపై బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా ఇన్సైట్స్ కంపెనీ టీఆర్ఏ (ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) రూపొందించిన జాబితాలో ఈ ర్యాంకులు దక్కించుకున్నాయి. టెలికం విభాగంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వరుసగా నిల్చాయి. అపారెల్ కేటగిరీలో అడిడాస్ అగ్ర స్థానంలో ఉండగా నైకీ, రేమాండ్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇతర విభాగాలు చూస్తే.. ♦ ఆటోమొబైల్ కేటగిరీలో బీఎండబ్ల్యూకి నంబర్ 1 ర్యాంకు దక్కింది. తర్వాత స్థానాల్లో టొయోటా, హ్యుందాయ్, హోండా ఉన్నాయి. ♦ బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగంలో ఎల్ఐసీది అగ్రస్థానం. ఎస్బీఐ 2వ, ఐసీఐసీఐ బ్యాంక్ 3వ ర్యాంకు దక్కించుకున్నాయి. ♦ కన్జూమర్ అప్లయెన్సెస్‌లో కెంట్ నంబర్ 1గా ఉండగా .. లివ్‌ప్యూర్, ఒకాయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ♦ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్జీ, సోనీ, శాంసంగ్ టాప్ 3 కంపెనీలుగా ఉన్నాయి. ♦ వివిధ రంగాల్లోకి విస్తరించిన దిగ్గజాల జాబితాలో ఐటీసీ అగ్ర స్థానంలో ఉండగా, టాటా, రిలయన్స్ తర్వాత ర్యాంకులు దక్కించుకున్నాయి. ♦ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, ఐవోసీ, అదానీ టాప్ 3లో ఉన్నాయి. -
మింత్రా ధమాకా సేల్: టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా కూడా ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్సేల్ రేపు (సెప్టెంబరు 23 నుంచి) షురూ కానుంది. ఈ సందర్భంగా టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం దాకా తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్ అండ్ ఎం, లిబాస్, రెడ్ టేప్,గినీ అండ్ జాయ్, మస్త్ అండ్ హార్బర్ ప్యూమా, నైక్ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబరు 23 నుంచి పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థల్లో పండుగ సీజన్ సేల్కు తెర తీయనున్నసంగతి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని రిటైలర్లు భావిస్తున్నారు. అందుకే డిస్కౌంట్, డీల్స్ అంటూ కస్టమర్లను ఊరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా 60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది. కస్టమర్లకు 6వేలకు పైగా బ్రాండ్లను అందుబాటులో ఉంచుతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు, ప్లస్ సైజ్ దుస్తులపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ప్యూమా కిడ్స్ వేర్‌పై కనీసం 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్యూమా, నైక్ స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూలను 50శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇంకా MAC, Lakme, Maybelline ఉత్పత్తులపై 15-40శాతం డిస్కౌంట్ లభ్యం. ఇంకా రెడ్ టేప్ షూస్‌పై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. -
టాప్‌లోకి ఆపిల్, ఫేస్బుక్ పడిపోయింది
ప్రపంచంలో టాప్ బ్రాండుల జాబితాలో స్థానాలన్నీ తారుమారు అయ్యాయి. టాప్ బ్రాండుగా ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చిన సెర్చింజన్ దిగ్గజం రెండో స్థానానికివచ్చేసింది. గూగుల్ స్థానాన్ని ఆపిల్ భర్తీ చేసి టాప్ కొచ్చింది. అదేవిధంగా ఇటీవల డేటా స్కాండల్ సమస్యలతో సతమతమవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్స్‘బెస్ట్ 100 గ్లోబల్ బ్రాండ్స్ 2018’ను జాబితాను ప్రకటించింది. దీనిలో టాప్ బ్రాండుగా ఆపిల్ చోటు దక్కించుకుంది. ఆపిల్ ఇటీవలే 1 ట్రిలియన్ డాలర్ల(రూ.73.7 లక్షల కోట్ల) మార్కెట్ క్యాప్‌ను సొంతం చేసుకున్న తొలి కంపెనీగా నిలిచింది. దీంతో ఆపిల్ బ్రాండు విలువ ఏడాది ఏడాదికి 16 శాతం పెరిగి, 214.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపిల్ టాప్‌లోకి రావడంతో, గూగుల్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గూగుల్ బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి, 155.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఆపిల్, గూగుల్ తర్వాత 56 శాతం వృద్దితో అమెజాన్ మూడో టాప్ బ్రాండుగా చోటు దక్కించుకుంది. అమెజాన్ తర్వాత 92.7 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానాన్ని, 66.3 బిలియన్ డాలర్లతో కోకా కోలా ఐదో స్థానాన్ని, శాంసంగ్ ఆరో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్ ఉదంతంతో ఫేస్బుక్ బ్రాండు విలువ 6 శాతం క్షీణించి, తొమ్మిదో స్థానంలోకి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత దశాబ్దంలో బ్రాండులు చాలా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చాయని, అవి తమ కస్టమర్లను అర్థం చేసుకుంటూ.. వారికి అనుగుణంగా ఎప్పడికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్‌లను అందజేస్తున్నాయని ఇంటర్‌బ్రాండ్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చార్లెస్ ట్రెవిల్ చెప్పారు. తొలిసారి స్పాటిఫై, సుబరు గ్లోబల్ టాప్ 100 బ్రాండ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా గతేడాది టాప్ 100లో ఉంది. కానీ ఈసారి టాప్ 100 రేసులో నిలువలేకపోయింది. దాని బ్రాండు, భవిష్యత్తుపై వివాదాలు నెలకొనడంతో, టెస్లా టాప్ 100లోకి రాలేకపోయింది. బ్రాండెడ్ ప్రొడక్ట్‌ల, సర్వీసుల ఆర్థిక పనితీరు, కొనుగోలు నిర్ణయాలు, బ్రాండ్ పోటీతత్వ బలం, విశ్వసనీయతను సృష్టించే సామర్ధ్యంను ఆధారంగా చేసుకుని ఇంటర్‌బ్రాండ్ ఈ రిపోర్టును విడుదల చేస్తుంది. -
రియల్టీలో ట్రంప్ బ్రాండ్!
• 5 ప్రాజెక్ట్‌లతో ఒప్పందం చేసుకున్న ట్రంప్ ఆర్గనైజేషన్ • నిర్మాణ దశలోనే 60 శాతం అమ్మకాలు పూర్తి • ఇతర స్థానిక ప్రాజెక్ట్‌లతో పోల్చితే 30 శాతం ధరలెక్కువ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు. కానీ, మన దేశంలో మాత్రం టాప్ బ్రాండ్. ట్రంప్ పేరు చెబితే చాలు స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి మరి. దేశంలోని పలు నిర్మాణ సంస్థలు ట్రంప్ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల ప్రీమియం ఫ్లాట్లు వేడి పకోడిల్లా అమ్ముడవుతుంటే.. నయా పైసా పెట్టుబడి లేకుండా ట్రంప్ ఆర్గనైజేషన్‌కు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. సాక్షి, హైదరాబాద్: ముంబై, పుణె, గుర్గావ్, కోల్‌కతా నగరాల్లో లోధా గ్రూప్, పంచశీల్, ఐఆర్‌ఈఓ, ఎం3ఎం, యూనీమార్క్ సంస్థలు నిర్మించే 5 ప్రాజెక్ట్‌లతో ట్రంప్ ఆర్గనైజేషన్ ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ ఒప్పందంతో ఆయా ప్రాజెక్ట్‌ల అమ్మకాల కోసం ట్రంప్ పేరును బ్రాండ్‌గా వినియోగించుకునే వీలు నిర్మాణ సంస్థలకుంటుంది. లైసెన్సింగ్ ఫీజు రూపంలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కూ ఆదాయమొస్తుంది. అయితే ఈ ఒప్పందం కేవలం ఆయా ప్రాజెక్ట్‌లకే పరిమితమని.. పైగా వీటి నిర్మాణంలో నయా పైసా పెట్టుబడులు కూడా పెట్టలేదని ట్రంప్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ⇔ ఇక ఆయా ప్రాజెక్ట్‌ల అమ్మకాలు, ధరల విషయానికొస్తే.. స్థానికంగా నిర్మించే ఇతర ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్‌ల అమ్మకాలు నిర్మాణ దశలోనే 60 శాతానికి పైగా పూరైతే.. ధరలూ 30 శాతం అధికంగా ఉన్నాయి. ⇔ ఆయా ప్రాజెక్ట్‌లు ఏంటంటే.. లోధా గ్రూప్ ముంబైలోని వర్లీలో 17.5 ఎకరాల్లో ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తోంది. 75 అంతస్తుల్లో మొత్తం 300 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.9 కోట్లు. కొనుగోలుదారులకు ట్రంప్ కార్డ్‌ను ఇస్తారు. దీంతో ప్రపం^è వ్యాప్తంగా ట్రంప్ హోటళ్లు, రిసార్ట్స్‌ల్లో ప్రత్యేక కేటాయింపులు, ఆఫర్లను అందుకోవచ్చు. ⇔ పుణెలోని కల్యానీ నగర్లో పంచశీల్ సంస్థ 2.68 లక్షల చ.అ.ల్లో ట్రంప్ టవర్‌ను నిర్మిస్తోంది. 2 టవర్లలో ఒక్కో టవర్ 23 అంతస్తుల్లో ఉంటుంది. ఒక్కో అంతస్తుకు ఒక్కో అపార్ట్మెంట్ దీని ప్రత్యేకత. ప్రతి ఫ్లాట్ 6,100 చ.అ. మేర విస్తరించి ఉంటుంది. ధర రూ.13 కోట్లు. ఇప్పటికే బాలీవుడ్ నటులు రిషీ కపూర్, రణబీర్ కపూర్ ఫ్లాట్లు కొనేశారు కూడా. ⇔ గుర్గావ్లోని గోల్ఫ్ ఎక్స్టెన్షన్ రోడ్లో ఐఆర్‌ఈఓ సంస్థ అస్కాట్ ఏరోసిటీ పేరిట కార్యాలయ సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇది 6–7 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో ఫైవ్ స్టార్ డ్యూలెక్స్ హోటల్స్, రిటైల్, షాపింగ్ సముదాయాలుంటాయి. ఇదే ప్రాంతంలో ఎం3ఎం సంస్థ భారీ నివాస సముదాయాన్ని నిర్మిస్తుంది కూడా. ⇔ కోల్‌కతాలో యూనీమార్క్ గ్రూప్ తూర్పు మెట్రోపాలిటన్ బైపాస్ ప్రాంతంలో ఈటర్నియా పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. 3.5 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రీమియం ప్రాజెక్ట్‌లో 38 అంతస్తులుంటాయి. 2,398 నుంచి 3,297 చ.అ.ల్లో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ఐటీ కొనుగోళ్లు తగ్గుతాయా? దేశంలో స్థిరాస్తి అమ్మకాలు ఐటీ చుట్టూనే తిరుగుతుంటాయి. అంటే నివాస కొనుగోళ్లు ఐటీ ఉద్యోగులు, కార్యాలయాల కొనుగోళ్లు ఐటీ కంపెనీలే సింహభాగం. అయితే ఇప్పుడా కొనుగోళ్లకు ట్రంప్ గండం ఎదురుకానుంది. అదెలాగంటే.. అమెరికా వలస విధానాన్ని, హెచ్1బీ వీసా పాలసీలను సమీక్షించాల్సిన అవసరం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదేగనక జరిగితే.. ఇన్నాళ్లు ఔట్సోర్సింగ్ సేవలందించే మన దేశ ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవు. సమీక్షకు తగ్గట్టుగా వేతనాలను పెంచలేని, సేవలను కొనసాగించలేని పరిస్థితి సంస్థలది. దీంతో ఇన్నాళ్లు అధిక వేతనాలతో స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ఐటీ పెట్టుబడులు ఇప్పుడు దూరమవుతాయనేది సారాంశం. ⇔ దేశంలో లగ్జరీ రియల్టీ మార్కెట్లో విదేశీ కొనుగోలుదారులు, లావాదేవీలు ఎక్కువని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అధ్యయనం పేర్కొంది. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య కాలంలో 102.6 బిలియన్ డాలర్ల నివాస సముదాయాలను విదేశీ కొనుగోలుదారులే చేశారని పేర్కొంది. ఈ గణాంకాలే నిర్మాణ సంస్థలని కలవరపెట్టిస్తున్నాయి.. సమీప భవిష్యత్తులో ఐటీ కొనుగోళ్లు ఎలా ఉంటాయోనని! స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.realty@sakshi.com