సత్తా చాటుకున్న రిలయన్స్‌ జియో | Reliance jio strongest telecom brand in India says Report | Sakshi
Sakshi News home page

సత్తా చాటుకున్న రిలయన్స్‌ జియో

Published Mon, Nov 14 2022 8:38 AM | Last Updated on Mon, Nov 14 2022 8:40 AM

Reliance jio strongest telecom brand in India says Report - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పటిష్టమైన టెలికం బ్రాండ్‌గా రిలయన్స్‌ జియో అగ్రస్థానం దక్కించుకుంది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. 2022కి సంబంధించి భారత్‌లో అత్యధికంగా ఇష్టపడే పటిష్టమైన బ్రాండ్స్‌ అంశంపై బ్రాండ్‌ ఇంటెలిజెన్స్, డేటా ఇన్‌సైట్స్‌ కంపెనీ టీఆర్‌ఏ (ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ) రూపొందించిన జాబితాలో ఈ ర్యాంకులు దక్కించుకున్నాయి.

టెలికం విభాగంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వరుసగా నిల్చాయి. అపారెల్‌ కేటగిరీలో అడిడాస్‌ అగ్ర స్థానంలో ఉండగా నైకీ, రేమాండ్, అలెన్‌ సోలీ, పీటర్‌ ఇంగ్లాండ్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

ఇతర విభాగాలు చూస్తే.. 
♦ ఆటోమొబైల్‌ కేటగిరీలో బీఎండబ్ల్యూకి నంబర్‌ 1 ర్యాంకు దక్కింది. తర్వాత స్థానాల్లో టొయోటా, హ్యుందాయ్, హోండా ఉన్నాయి. 
♦ బ్యాంకింగ్, ఆర్థిక సేవల విభాగంలో ఎల్‌ఐసీది అగ్రస్థానం. ఎస్‌బీఐ 2వ, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3వ ర్యాంకు దక్కించుకున్నాయి. 
♦ కన్జూమర్‌ అప్లయెన్సెస్‌లో కెంట్‌ నంబర్‌ 1గా ఉండగా .. లివ్‌ప్యూర్, ఒకాయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
♦ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఎల్‌జీ, సోనీ, శాంసంగ్‌ టాప్‌ 3 కంపెనీలుగా ఉన్నాయి. 
♦ వివిధ రంగాల్లోకి విస్తరించిన దిగ్గజాల జాబితాలో ఐటీసీ అగ్ర స్థానంలో ఉండగా, టాటా, రిలయన్స్‌ తర్వాత ర్యాంకులు దక్కించుకున్నాయి. 
♦ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, ఐవోసీ, అదానీ టాప్‌ 3లో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement