TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే ప్రపంచంలోని తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న కంపెనీల ర్యాంకింగ్‌లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్‌తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు 750 కంపెనీలున్న టైమ్ జాబితాలో ప్లేస్ దక్కించుకున్నాయి.
టైమ్ మ్యాగజైన్ , ఆన్‌లైన్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన 2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్‌లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు, సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా ఆ ర్యాంకింగ్‌లను కేటాయించారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్ మూవింగ్ టెక్ ర్యాంకింగ్‌లున్నాయి.
Infosys has been featured in TIME World’s Best Companies 2023 list. We are among the top 3 global professional services firm and the only brand from India in the Top 100 global rankings: https://t.co/Mvg9lRFxDV pic.twitter.com/dN6n0p76ZA
— Infosys (@Infosys) September 14, 2023
టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్‌ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్‌లలో తొలి నాలుగు కంపెనీలు అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి, వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి దోహద పడ్డాయని తెలిపింది.
ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment