ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని సూచించింది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సిబ్బందికి ఈ కొత్త నిబంధన తప్పని సరి అని మెయిల్‌లో పేర్కొంది.
గత అక్టోబర్‌లో ఇదే తరహా మెయిల్స్‌ను సిబ్బందికి పంపింది. ఆ మెయిల్స్ ప్రకారం.. బ్యాండ్ 5, బ్యాండ్ 6 ఉద్యోగులు నెలకు 10 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబట్టింది. ఆసక్తికరంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయానికి ముందే సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ.. రిమోట్ వర్క్ ఇన్ఫోసిస్ అనువైందేనని తెలిపారు.
కొద్దిరోజుల తర్వాత నెలకు 10 రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి రావాలంటూ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. తాజాగా, వారానికి మూడు రోజులు ఆఫీస్‌లో వర్క్ తప్పని సరి చేయడం ఐటీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.
తప్పదు.. ఏం చేస్తాం
కొన్ని సందర్భాలలో క్లయింట్‌లకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మా వరకు సౌకర్యవంతమైన పని విధానానికే మా మద్దతు ఉంటుంది. మేం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కూడా అవకాశం ఇచ్చాం. ఇప్పుడు క్లయింట్‌లకు అనుగుణంగా వర్క్‌ను మార్చాల్సి వస్తుందని సలీల్ పరేఖ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment