న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు జారీ చేసిన జీఎస్‌టీ ఎగవేత నోటీసుపై అధికారులు వెనక్కి తగ్గారు. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ ఎగవేత విషయంలో కంపెనీకి జారీ చేసిన ప్రీ–షోకాజ్ నోటీసులను కర్నాటక రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు ఉపసంహరించుకున్నారు. అయితే, దీనిపై జీఎస్‌టీ, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, సరీ్వస్ ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)కి వివరణ ఇవ్వాలని కంపెనీకి సూచించారు.
బీఎస్‌ఈకి వెల్లడించిన సమాచారంలో ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని తెలిపింది. 2017 నుంచి ఐదేళ్ల పాటు విదేశీ బ్రాంచ్‌ల నుంచి అందుకున్న సర్వీసులకు గాను రూ. 32,403 కోట్ల జీఎస్‌టీ చెల్లించాలంటూ పన్ను అధికారులు ఇనీ్ఫకి డిమాండ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇది కేవలం ప్రీ–షోకాజ్ నోటీసు మాత్రమేనని, అధికార యంత్రాంగం పేర్కొన్న వ్యయాలకు జీఎస్‌టీ వర్తించదని ఇన్ఫోసిస్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ ఉదంతంపై ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ కూడా స్పందించింది. పన్ను అధికారులు ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా భారీ వ్యాపార కార్యకలాపాలు గల కంపెనీలకు ఇలాంటి పన్ను నోటీసులను ఇచ్చే ముందు సరైన దర్యాప్తు, స్పష్టమైన రుజువులను సమరి్పంచాల్సి ఉంటుందని ఎస్‌కేఐ క్యాపిటల్ ఎండీ, సీఈఓ నరీందర్ వాధ్వా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment