ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేసింది. అందులో చాలా కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు పేర్లు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు..
- ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు
- మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు
- క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు
- వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు
- హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు
- భారతి గ్రూప్ రూ.247 కోట్లు
- ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు
- వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు
- కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు
- మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment