సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 50కి పైగా కంపెనీలు రూ.1,600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది.
రూ.1,600 కోట్లలో మదన్‌లాల్ లిమిటెడ్,ఎంకేజీ ఎంటర్‌ప్రైజెస్, కెవెంటర్స్ ఫుడ్ పార్క్ వంటి సంస్థలు రూ. 600 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిల్లో కెవెంటర్ గ్రూప్ భారీ మొత్తంలో బాండ్ల రూపంలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది.
కెవెంటర్ గ్రూప్ తర్వాత ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ హల్దియా ఎనర్జీ, ధరివాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కంపెనీలు దాదాపు రూ.500 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు విరాళం ఇచ్చాయి.
ఈ కంపెనీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చాయి. వాటిల్లో ఐటీసీ, రుంగ్తా గ్రూప్, రష్మీ గ్రూప్, అంబుజా, శ్యామ్ స్టీల్, ఐఎఫ్‌బీ గ్రూప్, రిప్లే, శ్రీ సిమెంట్, ధున్సేరి గ్రూప్, ఉత్కర్ష్ గ్రూప్, స్టార్ సిమెంట్, డబ్ల్యూపీఐఎల్, టెగా ఇండస్ట్రీస్, అక్రోపోలిస్ మెయింటెనెన్స్, ఎస్‌కేపీ మర్చంట్స్, ఆస్టిన్ ప్లైవుడ్స్ ఉన్నాయి.
ఇక, ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో సుమారు 1,260 కంపెనీలు, వ్యక్తులు సుమారు రూ.12,155.51 కోట్ల విలువైన 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ డేటా చూపించింది. ఈ కాలంలో రూ.12,769.09 కోట్ల విలువైన 20,421 బాండ్లను 23 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. బీజేపీ రీడమ్ చేసి రూ.6,061 కోట‍్లను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవగా రూ.1,610 కోట్లను తృణమూల్ కాంగ్రెస్, రూ.1,422 కోట్లను కాంగ్రెస్ రీడమ్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment