
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు.
మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు.
దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు.
కాంగ్రెస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం
లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్‌కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment