Extortion Donation
-
ఎలక్టోరల్ బాండ్లు అంతర్జాతీయ రాకెట్: రాహుల్
థానే: బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ముమ్మాటికీ అంతర్జాతీయ స్థాయి బలవంతపు వసూళ్ల రాకెట్ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయ పారీ్టలను చీల్చడానికి, రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈ పథకాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. మహరాష్ట్రలోని జాంభాలీ నాకాలో శనివారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగించారు. మన దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, నిరసన తెలిపినా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ వంటివి వెంటనే దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పారీ్టలు రెండుగా చీలడానికి కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారీ్టలు, పేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకకు కేవలం సంపన్న పారిశ్రామికవేత్తలను, సినిమా నటులను మాత్రమే ఆహా్వనించారని, పేదలను పక్కనపెట్టారని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివాసీ మహిళ అయినందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహా్వనించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్: జైరాం లోక్‌సభ ఎన్నికల ముందు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా తమపై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్రైక్‌కు దిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. దాంతో పార్టీ ఆర్థికంగా శక్తిహీనంగా మారిందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కూడా ఇప్పుడు తమ వద్ద డబ్బు లేదని అన్నారు. బాండ్ల ముసుగులో బీజేపీ చట్టవిరుద్ధంగా నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు. -
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్‌లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్‌కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
శివశివా.. ఏమిటీ విరాళాల గోల
శ్రీకాళహస్తి : విరాళాలు పెంచి ఆలయాభివృద్ధికి తోడ్పడాల్సిందే. అయితే శ్రీకాళహస్తిలో ఓ వైపు భోజనం చేస్తుండగానే మరోవైపు ఆలయ సిబ్బంది విరాళాల పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఎడమ చేత్తో విరాళాలు ఇవ్వలేక, భోజనం చేస్తున్న చేతితో ఇవ్వడం ఇష్టంలేక భక్తులు కుమిలిపోతున్నారు. విరాళాలు ఇస్తేనే మంచి జరుగుతుందంటూ సిబ్బంది చెబుతుండడంతో భక్తులు కాదనలేక పోతున్నారు. విరాళాలు అందజేసిన వారికి రసీదులు కూడా ఇవ్వడం లేదు. పుస్తకంలో పేర్లు నమోదు చేశామంటూ పంపేస్తున్నారు. సగం పేర్లు మాత్రమే పుస్తకంలో రాసి మిగిలిన మొత్తాన్ని నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దఎత్తున విరాళాలు వసూలు చేస్తేనే మీ ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ఉన్నతాధికారులు సిబ్బందిని హెచ్చరించినట్టు సమాచారం. ఈ విషయాన్ని భక్తుల వద్ద సిబ్బంది బాహాటంగానే చెబుతున్నట్టు తెలిసింది. అన్నదాన నిర్వహణ ఇలా.. శివయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్నదానం మహాప్రసాదంగా భావించి భక్తులు గంటలకొద్దీ టికెట్ల కోసం క్యూలో ఉంటున్నారు. అన్నదానం పథకానికి ఇప్పటి వరకు 41 వేల మందికి పైగా రూ.7.18 కోట్లు విరాళాలుగా అందజేశారు. దీనిపై 9శాతం వడ్డీ కూడా వస్తుండడంతో అన్నదాన పథకానికి ఏ ఢోకాలేదు. గతంలో ఆది, సోమవారాల్లో 800 మందికి, మిగిలిన వారాల్లో 400 మందికి భోజన వసతులు కల్పించారు. మూడు నెలలుగా శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 1000 మందికి, మంగళ, బుధ, గురువారాల్లో 800 మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు. గణాంకాల్లో చూపుతున్న విధంగా సగం మంది భక్తులకు కూడా ఈ పథకం కింద భోజన వసతి కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. భక్తులకు అందాల్సిన అన్నదానం కూపన్లను స్థానికులు కొందరు కాజేస్తున్నారు. దీంతో కొన్ని సమయాల్లో నిజమైన భక్తులకు కూపన్లు అందడం లేదు. అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిత్యాన్నదాన పథకం కింద ఏ విరాళ దాతల సహకారంతో భోజన వసతి ఏర్పాటు చేస్తున్నది బోర్డులో రోజువారీగా నమోదు చేయాల్సి ఉంది. అయితే అధికారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. ఇదిలా ఉండగా అన్నదాన మండపంలో భోజనం చేసిన భక్తులు వారి పళ్లెంను వారే తీసుకెళ్లే పద్దతిని ఈవో రహస్యంగా ప్రవేశపెట్టారు. మీడియాకు కూడా ఈ విషయాన్ని తెలియజేయలేదు. దీంతో వృద్ధులు, పిల్లలు, లగేజీతో వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బలవంతంగా వసూళ్లు ఆలయంలో అన్నదానం చేస్తుండడంతో భక్తులు మహాప్రసాదంగా భావించి భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓ చేతితో భోజనం చేస్తుంటే మరో చేతితో విరాళాలు ఇవ్వాలంటూ బలవంతంగా వసూళ్లు చేయడం మంచి పద్దతి కాదు. ఇవ్వాలనుకుంటే అన్నదాన మండపంలోని హుండీలో వేస్తాం. - మారెమ్మ, చీరాల మూడుచోట్ల వసూళ్లు భోజనం చేస్తుంటే పుస్తకంలో పేరు రాసుకున్నాం విరాళాలు ఇవ్వాలంటూ బలవంతం చేస్తున్నారు. భోజనం అయిన తర్వాత మండపంలోని హుండీలో విరాళాలు వేయాలంటూ గోల. మళ్లీ మండపం వరండాల్లో ఓ కౌంటర్ ఏర్పాటు చేసి విరాళాలు ఇవ్వాలంటూ శబ్ధాలు చేస్తున్నారు. అభిమానం ఉండేవాళ్లు హుండీలో విరాళాలు వేస్తారు. ఇదేం విడ్డూరమో తెలియడం లేదు. - సుగుణమ్మ, కావలి రూ.10,116 ఇస్తే రసీదులు ఇస్తున్నాం విరాళంగా రూ.10,116లు ఇచ్చేవారికి రసీదులు ఇస్తున్నాం. ఉద్యోగ భద్రత, బలవంతపు వసూళ్లు అనేదానిలో వాస్తవం లేదు. నెలకు రూ.18 వేలు మాత్రమే అన్నదానం హుండీల ద్వారా విరాళ ఆదాయం వచ్చేది. దాన్ని రూ.3.4 లక్షలకు పెంచడం జరిగింది. ఆలయాభివృద్ధి కోసమే విరాళాలు వసూళ్లు చేస్తున్నాం. శిరిడీ సాయిబాబా ఆలయంలో వలే శ్రీకాళహస్తిలోనూ భోజనం తర్వాత వారే పళ్లెం తీసుకుపోవాల్సి ఉంది. కొత్తగా ప్రవేశపెట్టాం. ఇందులో రహస్యమేమీ లేదు. - శ్రీనివాసరావు, ఆలయ ఈవో 12ఎస్‌కెహెచ్‌టీ02: భోజనం చేస్తున్న సమయంలో వసూలు చేస్తున్న విరాళం 12ఎస్‌కెహెచ్‌టీ04: భోజనం తర్వాత విరాళ హుండీ వసూళ్లు 12ఎస్‌కెహెచ్‌టీ05: మారెమ్మ 12ఎస్‌కెహెచ్‌టీ06: సుగుణమ్మ 12ఎస్‌కెహెచ్‌టీ07: ఈవో, శ్రీనివాసరావు 12ఎస్‌కెహెచ్‌టీ09: అన్నదానం టిక్కెట్లు కోసం క్యూకట్టిన భక్తులు 12ఎస్‌కెహెచ్‌టీ11: భోజనం తర్వాత పళ్లెం తీసుకెళుతున్న భక్తులు