సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించామని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కింద ఒక ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్‌బీఐ ఈ విషయం చెప్పింది. ‘‘2018 ఏడాది నుంచి ఇప్పటిదాకా 29 దఫాలుగా ఎలక్టోరల్ బాండ్లను విక్రయించాం.
వాటి మొత్తం విలువ రూ.15,956.30 కోట్లు. ఇందులో రూ.23.88 కోట్ల విలువైన 194 బాండ్లు ఏ రాజకీయ పార్టీ బ్యాంక్ ఖాతాలో జమకాని కారణంగా ఆ బాండ్ల మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్‌ఆర్‌ఎఫ్)కు బదిలీ చేశాం’’ అని బ్యాంక్ తెలిపింది. లోకేశ్ బాత్రా అనే మాజీ నావికా అధికారి ఆర్టీఐ చట్టం కింద అభ్యరి్థంచడంతో బ్యాంక్ పై విధంగా సమాధానమిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment