ముంబై: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించేందుకు నిరాకరించారు. ఆర్‌బీఐ ద్వై మాసిక క్రెడిట్ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 5)గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఎన్నికల బాండ్లపై గవర్నర్‌ను ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని సమాధానమిచ్చారు.
‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించింది. కంపెనీలు తమ నికర విలువ కంటే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం అనే అంశం మా పరిధిలోకి రాదు’అని దాస్ చెప్పారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్‌బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది.
ఇదీ చదవండి.. బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. రూల్స్‌లో కీలక మార్పులు
Comments
Please login to add a commentAdd a comment