ఎలక్టోరల్‌ బాండ్ల కొత్త డేటా విడుదల.. ఏ పార్టీకి ఎంత? | Electoral Bonds: EC Releases Fresh Data Funding To Political Parties | Sakshi
Sakshi News home page

ఎలక్టోరల్‌ బాండ్ల కొత్త డేటా విడుదల.. ఏ పార్టీకి ఎంత?

Published Sun, Mar 17 2024 5:34 PM | Last Updated on Sun, Mar 17 2024 5:55 PM

Electoral Bonds: EC Releases Fresh Data Funding To Political Parties - Sakshi

ఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఆదివారం ఎన్నికల సంఘం వెల్లడించింది. సీల్డ్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీ పార్టీ అత్యధికంగా రూ.6,986.50 కోట్ల విరాళాలను పొందినట్లు తెలిపింది. కేవలం 2019-2020 మధ్య బీజేపీకి రూ.2,555 కోట్ల బాండ్లు అందినట్లు ఈసీ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఇక.. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి రూ.1,397కోట్ల విలువైన బాండ్లను విరాళాలుగా పొందినట్లు తెలిపింది.

ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆయా పార్టీకు వచ్చిన విరాళాలు

  • కాంగ్రెస్‌ పార్టీ- రూ.1334 కోట్లు 
  • బీఆర్‌ఎస్‌- రూ. 1322 కోట్లు
  • బిజు జనతాదళ్‌- రూ.944 కోట్లు
  • డీఎంకే - రూ. 656.5 కోట్లు (ఇందులో రూ. 509 కోట్లు లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ నుంచి వచ్చాయి)
  • వైఎస్సార్‌సీపీ- రూ.442.8 కోట్లు
  • టీడీపీ- రూ.182. 35 కోట్లు
  • సమాజ్‌వాదీ పార్టీ- రూ. 14.5 కోట్లు
  • అకాలీదళ్‌- రూ.7.26 కోట్లు
  • ఏఐఏడీఎంకే- రూ.6.05 కోట్లు
  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌- రూ. 50 లక్షలు

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని మార్చి 15 నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి:  ఒకే డ్రెస్‌ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement