న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండేళ్లుగా వెతుకుతున్న కోట్ల రూపాయల సొమ్ము ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాకే చేరిందని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) విమర్శించింది. ఈ మేరకు శనివారం(మార్చ్ 23)ఉదయం ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు.
‘రెండేళ్ల విచారణ తర్వాత కూడా స్కామ్‌లో డబ్బులెక్కడికి పోయాయనే ప్రశ్న మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. ఇంత వరకు ఆప్ నేతల నుంచి స్కామ్‌కు సంబంధించి ఒక్క రూపాయిని కూడా రికవర్ చేయలేకపోయారు. లిక్కర్ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని గతంలో విచారించినపుడు కేజ్రీవాల్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని ఆయన చెప్పారు.
అలా చెప్పిన మరుసటి రోజే శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. అరెస్టయిన తర్వాత ఆయన స్టేట్‌మెంట్ మారిపోయింది. కేజ్రీవాల్‌ను కలిసి డబ్బులిచ్చాను అని చెప్పగానే శరత్‌చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశామని ఈడీ చెబుతోంది’అని మంత్రులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment