ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్‌ నేతలు అలర్ట్! | Arvind Kejriwal To Be Arrested Today? | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్? ఆప్‌ నేతలు అలర్ట్!

Published Thu, Jan 4 2024 7:33 AM | Last Updated on Thu, Jan 4 2024 10:37 AM

Arvind Kejriwal To Be Arrested Today - Sakshi

ఢిల్లీ:  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నేడు ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని అప్ నేతలు తెలిపారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ ఇంటిపై సోదాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ విధంగా ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ నేడు అరెస్టు చేసే అవకాశం ఉందనే వార్తలపై ఈడీ స్పందించింది. కేజ్రీవాల్‌పై దాడులు జరగట్లేదని స్పష్టం చేసింది. విచారణకు కేజ్రీవాల్ రాకపోవడానికి గల కారణాలను పరిశీలిస్తోంది. మరోసారి సమన్లు జారీ చేస్తామని పేర్కొంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఇప్పటికీ కేజ్రీవాల్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఈడీ వర్గాలు తెలిపాయి.

కేజ్రీవాల్ ఇప్పటికే మూడుసార్లు విచారణ కోసం ఈడీ పంపిన సమన్లను దాటవేశారు. చివరిసారిగా జనవరి 3న హాజరుకావడానికి కూడా నిరాకరించారు. నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. ఆయన్ని అరెస్టు చేయవచ్చు.

ఈడీ సమన్లు ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా? లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా? అనేది స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఆపాలనే ఈడీ యోచిస్తున్నట్లు ఆరోపించారు. 

ఇదీ చదవండి: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement