న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను శుక్రవారం(మార్చ్ 22) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కలిసే అవకాశాలున్నాయి. గురువారం రాత్రి కేజ్రీవాల్ అరెస్టయిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు రాహుల్ ఫోన్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కేజ్రీవాల్‌కు అవసరమైన న్యాయ సహాయంపై చర్చించేందుకే రాహుల్ గాంధీ ఆయనను కలిసేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆయనను కలవడం సాధ్యపడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఒక వేళ కేజ్రీవాల్‌ను కలవడం వీలుకాకపోతే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిసి సంఘీభావం ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాహుల్ వారికి భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖండించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేసేందుగాను రెండు పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల పంపిణీ కూడా పూర్తయింది.
ఇదీ చదవండి.. లిక్కర్ స్కామ్.. కేజ్రీవాల్ అరెస్ట్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment