సాక్షి, ముంబై : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఈ ఎలక్టోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార‍్టీలకు చెందిన నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్‌పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్ ద్వారా గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేయడం, నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా..గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేసింది. అవి అధికార పార్టీ బీజేపీ అకౌంట్‌లలో జమవుతాయి. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. ఎలక్టోరల్ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు బదిలీ చేసిన కంపెనీలకు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని సూచించారు. ప్రజలు ఇలాంటి వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్‌లను కొనుగోలు చేస్తారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment