నార్త్ లఖీంపూర్ (అసోం): దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆరెస్సెస్‌ల నరనరాన నిండిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మాత్రం అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం లభించే స్థానిక స్వపరిపాలనే మూలమంత్రమని చెప్పారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శుక్రవారం అసోంలోని గోగాముఖ్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో సమ ప్రాధాన్యముందని చాటేందుకే యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెట్టానని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మోదీకి అక్కడ పర్యటించే తీరిక లేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment