local self-government
-
బీజేపీది ‘ఢిల్లీ’ పాలన: రాహుల్
నార్త్ లఖీంపూర్ (అసోం): దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆరెస్సెస్‌ల నరనరాన నిండిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు మాత్రం అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం లభించే స్థానిక స్వపరిపాలనే మూలమంత్రమని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శుక్రవారం అసోంలోని గోగాముఖ్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో సమ ప్రాధాన్యముందని చాటేందుకే యాత్రను మణిపూర్ నుంచి మొదలు పెట్టానని చెప్పారు. ‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మోదీకి అక్కడ పర్యటించే తీరిక లేదు’’ అన్నారు. -
జమ్మూ కాశ్మీర్లో నేడు రాహుల్ పర్యటన
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఉదయం జమ్మూ చేరుకుంటారు. జమ్మూలోని పీసీసీ కార్యాలయంలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సభ్యులతో ఆయన భేటీ అవుతారు. బుధవారం రాత్రి జమ్మూలోనే రాహుల్ బస చేయనున్నారు. గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని నిర్మించిన ఉద్యానవనానికి చెందిన స్టోర్స్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ త్వరాత బద్గమ్లోని మహిళ స్వయం సహాయ బృందాలతో సమావేశం కానున్నారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ పాల్గొనున్నారు. అనంతరం గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది.