జమ్మూ కాశ్మీర్లో నేడు రాహుల్ పర్యటన | Rahul Gandhi to begin two-day visit to Jammu and Kashmir today | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్లో నేడు రాహుల్ పర్యటన

Published Wed, Nov 6 2013 10:29 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

జమ్మూ కాశ్మీర్లో నేడు రాహుల్ పర్యటన - Sakshi

జమ్మూ కాశ్మీర్లో నేడు రాహుల్ పర్యటన

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా  ఆయన బుధవారం ఉదయం జమ్మూ చేరుకుంటారు. జమ్మూలోని పీసీసీ కార్యాలయంలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సభ్యులతో ఆయన భేటీ అవుతారు.

 

బుధవారం రాత్రి జమ్మూలోనే రాహుల్ బస చేయనున్నారు. గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని నిర్మించిన ఉద్యానవనానికి చెందిన స్టోర్స్ను ఆయన ప్రారంభిస్తారు. ఆ త్వరాత బద్గమ్లోని మహిళ స్వయం సహాయ బృందాలతో సమావేశం కానున్నారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ పాల్గొనున్నారు. అనంతరం గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement