విజయవాడ: ఏపీలో రేపు(ఆదివారం) జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్-2 పరీక్షలు జరుగుతుండగా, 4, 83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,327 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం గం. 10.30ని.ల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించనున్నారు.. గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకి అన్ని జిల్లాలలో ఏర్పాట్లు చేశారు.
24 మంది జిల్లా కలెక్టర్లకి గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారుల్ని ఈ నియమించారు. 24 వేల మంది ఇన్విజిలేటర్లు, 8,500మందిని కూడా నియమించారు. ఇక ఏపీపీఎస్సీ నుంచి 51 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గ్రూప్-2 పరీక్షల ఏర్పాట్లపై ఈరోజు(శనివారం) కలెక్టర్లతో సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment