25నే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ | SBI will conduct the exam on March 4 for 550 candidates | Sakshi
Sakshi News home page

25నే గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌

Published Thu, Feb 22 2024 5:57 AM | Last Updated on Thu, Feb 22 2024 11:35 AM

SBI will conduct the exam on March 4 for 550 candidates - Sakshi

సాక్షి, అమరావతి: ఒకే రోజు గ్రూప్‌–2 ప్రిలిమ్స్, ఎస్‌బీఐ పరీక్షలు ఉన్నాయని.. ఈ రెండింటికి దరఖాస్తు చేసినవారు ఉన్నారని.. ఈ నేపథ్యంలో గ్రూప్‌–­2 పరీక్ష వాయిదా వేయించాలని కుయుక్తులు పన్నిన ఎల్లో బ్యాచ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్‌–2 పరీక్ష జరిగే ఈ నెల 25న ఎస్‌బీఐ ప­రీక్ష కూడా రాస్తున్నవారు కేవలం 550 మందే ఉన్నారని తేలింది.

ఈ 550 మందికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్‌బీఐ తెలిపింది. దీంతో యధావిధిగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. గ్రూప్‌– 2 పరీక్షను ఈ నెల 25న నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కోసం 1,327 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 4.30 లక్షల మంది హాల్‌టికెట్లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

4.83 లక్షల మంది శ్రమను వృథా చేయాలని..
దాదాపు 4.83 లక్షల మంది గ్రూప్‌–2 అభ్యర్థుల శ్ర­మను వృథా చేయాలని ఎల్లో బ్యాచ్‌ కుట్ర పన్నింది. గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ రోజే ఎస్‌బీఐ జూనియర్‌ అసోí­Üయేట్‌ పరీక్ష కూడా ఉందని.. ఇలాంటి వారు 10 వే­ల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. వీరికి నష్టం క­ల­గకుండా గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. కానీ లక్షల మంది గ్రూప్స్‌ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఏపీపీఎస్సీ.. ఎస్‌­బీఐ బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించింది.

ఈ నెల 25న పరీక్ష స్లాట్‌ కేటాయించిన ఎస్‌బీఐ అభ్యర్థులకు మరోరోజు అవకాశం ఇవ్వాలని విన్నవించిం­ది. దీంతో ఎస్‌బీఐ అధికారులు గ్రూప్‌–2, ఎస్‌­బీఐ రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను త­మకు పంపించాలని ఏపీపీఎస్సీని కోరారు. దీంతో ఏపీపీఎస్సీ ఈనెల 19 వరకు రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను సేకరించగా మొత్తం 550 మం­ది ఉన్నట్టు తేలింది. దీంతో వీరికి మార్చి 4న పరీక్ష నిర్వహిస్తామని ఎస్‌బీఐ తెలిపింది.

ఈ అభ్యర్థులు 23వ తేదీ ఉదయం 9 గంటల్లోగా https://ibpsonline.ibps.in /sbijaoct23/ లో పరీక్ష తేదీ మార్పుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో ఏదో ఒక సాకుతో గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేయించాలనుకున్న ఎల్లో బ్యాచ్‌ ఎత్తుగడ బెడిసికొట్టింది. 

వాయిదాలు లేకుండా 31 నోటిఫికేషన్లు పూర్తి 
గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లు అరకొరే. వాటి పరీక్షలు కూడా ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉండేది. ఏళ్ల తరబడి అభ్యర్థుల భావోద్వేగాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంది. ఒకే రోజు రెండు పరీక్షలు వచ్చినప్పుడు సమస్యను అధిగవిుంచడంపై దృష్టి పెట్టకుండా ‘వాయిదా’ నిర్ణయం తీసుకునేవారు. దీంతో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పరీక్షలకు సిద్ధమయ్యే ఎంతోమంది నష్టపోయేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019 జూన్‌ నుంచి 2023 మధ్య ఏపీపీఎస్సీ 31 నోటిఫికేషన్లను నేరుగా జారీ చేసింది. నోటిఫికేషన్‌ ఇచ్చే ముందే వివాదాలు, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఈ నాలుగేళ్లల్లో ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా దాదాపు 6,300 పోస్టులను భర్తీ చేసింది.

అంతేకాకుండా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ పరీక్షలను సైతం ఏపీపీఎస్సీనే విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఒకేసారి 1.34 లక్షల మందికి మేలు చేసింది. గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌–1, గ్రూప్‌–2, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్స్, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్స్‌తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఇంకో 5 నోటిఫికేషన్లు జారీ చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement