
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్ ఆఫీసర్ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (29), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (1), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (2) ఉన్నాయి.
ఈ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ చూడొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment