
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టుల్లో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.