ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్స్
► మొత్తం పోస్టుల సంఖ్య: 190
► విభాగాలు: సివిల్, ఈఎన్‌వీ, మెకానికల్.
► సర్వీస్‌లు: ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, పీహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ పంచాయతీరాజ్ అండ్ డెవలప్‌మెంట్ సబార్డినేట్ సర్వీస్‌లు, ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్, ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీస్. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ /బీటెక్, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు:01.07.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. దీన్ని మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021
► వెబ్‌సైట్: https://psc.ap.gov.in
ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు
Published Mon, Oct 11 2021 6:12 PM | Last Updated on Mon, Oct 11 2021 7:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment