
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు గడువును మరో వారం రోజల పాటు పొడిగించింది. వాస్తవానికి బుధవారంతో దరఖాస్తు గడువు ముగిసింది.
అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ తెలిపారు. ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలో మార్పు లేదని, ఫిబ్రవరి 25నే పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు.
చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా!