టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. 10 మందికి గాయాలు | Lorry hit The Tataac, 10 Labourers Injured | Sakshi
Sakshi News home page

టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. 10 మందికి గాయాలు

Published Sun, Mar 26 2017 12:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

Lorry hit The Tataac, 10 Labourers Injured

తొర్రూరు: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement