గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం | TRS MLA Chinnaiah Development Work Adilabad | Sakshi

గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం

Published Fri, Jul 6 2018 11:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

TRS MLA Chinnaiah Development Work Adilabad - Sakshi

కొండపూర్‌యాపలో సీసీ రోడ్డు పనులకు భమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే

కాసిపేట: గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మండలంలోని కొండపూర్‌యాపలో గురువారం ఎండీఎఫ్‌(మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండీఎఫ్‌ నిధులతో గ్రామాల్లో రోడ్డు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

మురుగు కాలువలు, ఇతర సమస్యలు అన్నింటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ హయంలో గ్రామాలు అన్నిరకాలుగా అభివద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వంశీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణరెడ్డి, ఎంపీటీసీలు దాసరి శ్రీకాంత్, మంజుల, సర్పంచ్‌ ప్రేంకుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, విక్రంరావు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement