mla chinnaiah
-
గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
కాసిపేట: గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మండలంలోని కొండపూర్‌యాపలో గురువారం ఎండీఎఫ్(మినరల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండీఎఫ్ నిధులతో గ్రామాల్లో రోడ్డు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాలువలు, ఇతర సమస్యలు అన్నింటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ హయంలో గ్రామాలు అన్నిరకాలుగా అభివద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణరెడ్డి, ఎంపీటీసీలు దాసరి శ్రీకాంత్, మంజుల, సర్పంచ్ ప్రేంకుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, విక్రంరావు తదితరులున్నారు. -
ఎమ్యెల్యే చిన్నయ్య కుటుంబసభ్యులకు బెదిరింపు
-
హాస్టల్లో ఎంపీ, ఎమ్మెల్యే నిద్ర
వేమనపల్లి : మారుమూల వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ ఆశ్రమోన్నత పాఠశాలలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్య విద్యార్థులతో కలిసి నిద్రించారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ కోలి వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి మధునయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలోనే వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠ్య పుస్తకాలు తెరిచి ప్రశ్నలడిగారు. వారి వెంట జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, ఎంపీపీ కుర్రు వెంకటేశం,సర్పంచులు ఇందిరామధూకర్, వెంకటేశం, శంకర్‌గౌడ్, మధూకర్గౌడ్ తదితరులు ఉన్నారు. రూరల్ సీఐ అడ్డూరి రాములు, ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు ఏర్పాటుచేశారు.