హాస్టల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే నిద్ర | MP, MLA sleep in Hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే నిద్ర

Published Sat, Feb 14 2015 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

హాస్టల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే నిద్ర

హాస్టల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే నిద్ర

వేమనపల్లి : మారుమూల వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ ఆశ్రమోన్నత పాఠశాలలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే చిన్నయ్య విద్యార్థులతో కలిసి నిద్రించారు. టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కోలి వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి మధునయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి వరకూ కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలోనే వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠ్య పుస్తకాలు తెరిచి ప్రశ్నలడిగారు.

వారి వెంట జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, ఎంపీపీ కుర్రు వెంకటేశం,సర్పంచులు ఇందిరామధూకర్, వెంకటేశం, శంకర్‌గౌడ్, మధూకర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. రూరల్ సీఐ అడ్డూరి రాములు, ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement