దత్తత గ్రామాల్లోనూ పనులు చేయకుంటే ఎలా | collector question the works about adopted villages | Sakshi
Sakshi News home page

దత్తత గ్రామాల్లోనూ పనులు చేయకుంటే ఎలా

Published Fri, Sep 30 2016 9:44 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector question the works about adopted villages

ఏలూరు (మెట్రో)
 జిల్లాలో దత్తత గ్రామాల్లో కూడా పనులు జరగకపోతే ఎలా ? ఏడాది నుండి దత్తత గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కూడా కాకపోతే ఇక అభివద్ధి పనులు వేగవంతం ఎలా అవుతాయని జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో దత్తత గ్రామాలలో అభివద్ధి పనుల అమలు తీరుపై కలెక్టరు ప్రశ్నించారు.

కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది ప్రజాప్రతినిధులు జిల్లాలో పలు గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిద్దాలని ఎంతో ఆతతతో ఉన్నారని  వారు ఆశించిన మేరకు పనుల ప్రగతి కనిపించడం లేదని పనులు పూర్తవడానికి మరుగుదొడ్లు నిర్మించాలని ఏడాది క్రితమే నిర్ణయించినప్పటికీ 524 మరుగుదొడ్లు ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని కలెక్టర్‌ మండలాధికారులను ప్రశ్నించారు. జిల్లాలో బహిరంగ  మలవిసర్జన లేని విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో జాప్యం జరుగుతోందని  

ప్రజల ఆలోచనాధోరణి మారాలని కలెక్టరు కోరారు.  గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా కుటుంబ సభ్యుల ఆత్మగౌరవాన్ని దష్టిలో పెట్టుకుని ఇంటింటా మరుగుదొడ్డి ముఖ్యమనే భావన పెంచుకోవాలని నేడు సెల్‌ఫోన్‌కు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వమే రూ. 15 వేలు ఉచితంగా ఇచ్చి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోమంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టరు ప్రశ్నించారు. సంజీవపురం, పెదమైనివానిలంక, పెదకాపవరం, కె.రామవరం, తదితర దత్తత గ్రామాల్లో చేపట్టిన పనులన్ని డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ బాలకష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌. అమరేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు,  డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.కోటేశ్వరి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement