
పోలవరం రూరల్(ఏలూరు జిల్లా): పోలవరం జల విద్యుత్ కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్‌కో, మేఘా ఇంజినీ రింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగింపు పనులు చేపట్టారు.
ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్ కేంద్రంలోని ట ర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్‌ను ఉపయోగిస్తారు.
చదవండి: మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
Comments
Please login to add a commentAdd a comment