
ఇటుకలు తీసుకెళ్తున్న విద్యార్థులు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం మన్నీల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషియల్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివమ్మపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నిర్మిస్తున్న టీచర్ ఇంటి వద్ద ఆదివారం పలువురు విద్యార్థులు ఇటుకలు, సిమెంట్, ఇసుక మోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి.
ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో తన ఇంటి వద్ద పని చేసేందుకు పిల్లల్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సాయి ప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై విచారణ చేయిస్తున్నామన్నారు. ఆదివారం ఓ శుభకార్యం జరిగితే విద్యార్థులు వచ్చి భోజనం చేసి వెళ్లారని.. పనులు చేయించుకోలేదని టీచర్ చెప్పారన్నారు.