నాణ్యతకు కోత
నాణ్యతకు కోత
Published Wed, Aug 31 2016 11:14 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
* పుష్కరాలకు నాసిరకంగా రోడ్డు నిర్మాణం
* ఒక్క వర్షంతోనే కోతకు గురైన మార్జిన్లు
* వాహనాలు రోడ్డు అంచుకు వెళ్తే ముప్పే
* రూ.2 కోట్ల పనుల తీరిదీ
తమ్ముళ్ల జేబులు నింపడానికి ప్రభుత్వం పుష్కర పనుల పేరిట కోట్లాది రూపాయలు వెదజల్లింది. కాంట్రాక్టర్లు నాణ్యతకు పాతర వేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నెల రోజులు కూడా గడవక ముందే పనుల్లో డొల్లతనం బయట పడుతోంది.
క్రోసూరు: కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. తమకు అధికారపార్టీ అండదండలుంటే చాలన్న చందంగా ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు వ్యవహరిస్తుండటంతో రోడ్ల నిర్మాణాలు నాసిరకంగానే పూర్తవుతున్నాయి. పుష్కరాల పనుల్లో భాగంగా రూ.2 కోట్ల నిధులతో క్రోసూరు మండలంలోని బయ్యవరం నుంచి క్రోసూరు వరకు 10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయట పడింది. వర్షానికి విప్పర్ల చెక్‌డ్యాం వద్ద రోడ్డు మార్జిన్లు భారీగా కోత గురయ్యాయి. రోడ్డు మార్జిన్‌లో ఉన్న చౌడు మట్టి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మార్జిన్ వద్ద మట్టి అంచు కొంత మేర కూలిపోయింది. రోడ్డు మార్జిన్‌లో వేసిన రాళ్లను కనీసం రోలర్‌తో చదును చేయకుండా వదిలేయడంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. రోడ్డు మార్జిన్లు అల్పంగా ఉండటంతో ఏదైనా పెద ్దవాహనం వచ్చినా పక్కకు ఒరిగిపోయే ముప్పు కూడా పొంచి ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మళ్లీ మళ్లీ పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగచేస్తున్నారని ప్రజలంటున్నారు.
బాగు చేయిస్తాం..
రోడ్డు పని పూర్తి కాలేదు. నార్మ్స్ ప్రకారం రోడ్డు షోల్డర్స్‌కు బలం కొరకు సైడు మట్టితోనే వేయాల్సి ఉంది. వర్షానికి కోతకు గురైన రోడ్డును కాంట్రాక్టరే బాగు చేయాలి. లేకుంటే బిల్లులు మంజూరు చేయం. రోడ్డు గట్టితనం కోసమే షోల్డర్స్‌కు మాత్రం రాళ్లు వేసాం. పెద్దసైజు రాళ్లు తొలగిస్తాం. దానిపై తిరిగి కంకర వేసి రోలర్‌తో చదును చేస్తాం. కొద్దిగా తెరపి ఇచ్చిన వెంటనే పనులు చేస్తాం.
– అబ్బాస్ కెనడీ, ఆర్‌అండ్‌బీ ఏఈ
Advertisement
Advertisement