అలంపూర్: పుష్కరాల ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. పుష్కర స్నానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేయనున్నారు. పుష్కర స్నానాలకు వేలాదిగా యాత్రీకులు తరలి రానున్నారు. ఈ క్రమంలో పుష్కర పనుల్లో హడావుడి పెరిగింది. పనులు అలస్యంగా ప్రారంభం కావడంతో ఇంకా కొనసాగుతున్నాయి.
పుష్కర పనులకు తుదిమెరుగులు
Published Thu, Aug 11 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
పుష్కర పనులకు తుదిమెరుగులు
కృష్ణాపుష్కరాలు, పనులు, తుదిమెరుగులు
అలంపూర్: పుష్కరాల ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. పుష్కర స్నానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేయనున్నారు. పుష్కర స్నానాలకు వేలాదిగా యాత్రీకులు తరలి రానున్నారు. ఈ క్రమంలో పుష్కర పనుల్లో హడావుడి పెరిగింది. పనులు అలస్యంగా ప్రారంభం కావడంతో ఇంకా కొనసాగుతున్నాయి. ఘాట్ల వద్ద ప్రధాన పనులు పూర్తి చేసినప్పటికీ చివరి దశ పనులు పూర్తి చేయడంలో ఆయా శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. అలంపూర్ మండలంలోని జోగుళాంబ ఘాట్‌లో ఫ్లోరింగ్ పనులు చివరి దశకు చేరాయి. ఘాట్‌ల వద్ద విద్యుదీకరణ, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌కు పక్కగా పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఘాట్‌కు ఇరువైపులా భ్యారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను పసిగట్టడానికి, ఘాట్‌ను నిరంతరం పరిశీలించడానికి వీలుగా సీసీ కెమెరాలు, ఎల్‌టీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాట్‌పై ప్రత్యేక ఆకర్షణ కోసం శివుడి విగ్రహాల ఏర్పాటు జరుగుతోంది.ఘాట్‌కు ఇరువైపుల సుమారు 48 మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇక్కడే తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Advertisement