డ్యామ్ పైనుంచి కిన్నెరసాని రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
-
మరింత వేగవంతం చేయాలి
-
కాంట్రాక్ట్ కంపెనీలను ఆదేశించిన
-
జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
పాల్వంచ : కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దని, ముందస్తు ప్రణాళికలతో చకచకా సాగేలా చూడాలని టీఎస్ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలో కాంట్రాక్ట్ కో–ఆర్డినేష¯ŒS మీటింగ్(సీసీఎం) నిర్వహించారు. నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తోపాటు అనుబంధ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు, జె¯ŒSకో డైరెక్టర్లు, కేటీపీఎస్ అధికారులతో మాట్లాడారు. విభాగాలవారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పనులు మందగిస్తున్నాయనే సాకు చెప్పొద్దని, అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘ప్రభుత్వం నుంచి మాపై ఒత్తిడి ఉంది. సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి పనులు పూర్తిచేయాలి’’ అని చెప్పారు. పనులను జెన్‌కో, కేటీపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రతి వారం ప్రొగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం, 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. కూలింగ్ టవర్ నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్ రాధాకృష్ణ, సచ్చిదానందం, సివిల్ సీఈ అజయ్, ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్ కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్‌ఈలు నరిసింహ, ఎల్లయ్య, యుగపతి, బీహెచ్‌ఈఎల్, పవర్‌మెక్, పుంజులాయిడ్, ఎస్‌అండ్‌సీ, సంతోష్ పాల్గొన్నారు.
నవంబర్‌లో ‘భద్రాద్రి’ పనులు ప్రారంభం
కిన్నెరసాని (పాల్వంచ రూరల్): భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో (నవంబర్‌లో) ప్రారంభమవుతాయని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఆయన మంగâýæవారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి ప్లాంట్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. వచ్చే నెలలో పనులను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. కేటీపీఎస్ 7వ దశ, పులిచింతలలోని విద్యుత్ కర్మాగారాన్ని 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఇంజనీర్లతో కూడా ఆయన మాట్లాడారు. కిన్నెరసాని నీటి మట్టాన్ని గరిష్ట స్థాయిలో ఉంచుతున్నామని, దీని వలన డ్యామ్‌కు ప్రమాదం లేదని చెప్పారు.