SOT
-
నిందితుల చేతిలో ‘పోలీసుల’ భవిత!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా క్రిమినల్ కేసుల దర్యాప్తులో నిందితుల భవిష్యత్తు పోలీసుల చేతు ల్లో ఉంటుంది. ఎవరెవరిని నిందితులుగా చేర్చాలి? వారిపై ఏఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపాలి? అనేది కేసుల దర్యాప్తు ఆధారంగా వీళ్లే నిర్ణయిస్తారు. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొందరు పోలీసు ఉన్నతాధికారుల భవిత ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చేతిలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లు చెప్పే అంశాలపై డీజీ పీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలావుండగా ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఈ నెల 10 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసు కస్టడీ పూర్తయి, జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును అదనపు కస్టడీకి కోరుతూ పంజగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు దగ్గరే ఆగిన కేసు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగింది. దర్యాప్తు అధికారులు కూడా ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితం అవుతున్నారు. అయితే ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ.. ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. విదేశాలనుంచి ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అరెస్టు అయిన పోలీసులతో పాటు అరెస్టు కాబోయే వారు, విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు పట్టుబడిన తర్వాత.. ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని వారు చెప్తే వారికీ నోటీసులు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్ అదుపులో వేణుగోపాల్‌రావు పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌రావును బుధవారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐబీలోని ఎస్ఓటీలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారుల్లో ఓఎస్డీ హోదాలో పని చేసిన ఈయన కూడా ఒకరు. అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఓఎస్డీగా పని చేశారు. ప్రత్యేక విభాగాలు కమిషనర్ల అదీనంలో టార్గెట్ చేసిన ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు తదితరులపై సాంకేతిక నిఘా ఉంచడం, వారి ఫోన్లు ట్యాప్ చేయడం ఎస్ఐబీ అ«దీనంలో ఎస్ఓటీ చేసింది. అయితే వారిని పట్టుకోవడం, నగదు స్వాదీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు చేశాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన అక్రమ ఆపరేషన్లు ఆ విభాగాలకు నేతృత్వం వహించిన కమిషనర్లకు తెలియకుండానే జరిగాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయాలపై నిందితులు ఏదైనా చెబితే ఆయా ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించడం అనివార్యంగా మారుతుంది. దీనిపై ఓ రిటైర్డ్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయా ఉన్నతాధికారులు కేసులో నిందితులు కాకపోయినా, వారి పర్యవేక్షణ లోపం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లు క్రిమినల్ చర్యలకు కాకపోయినా..డిపార్ట్మెంటల్ యాక్షన్‌కు అర్హులే’అని అన్నారు. -
HYD: ఈ-సిగరెట్ల కలకలం.. విద్యార్థులే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రాయదుర్గం పరిధిలో ఎస్వోటీ(Special Operation Team) భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుంది. వాటిని అమ్ముతున్న, కొంటున్న విద్యార్థులనూ అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇంటర్నేషన్ స్కూల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు కేటుగాళ్లు. అందులోని నికోటిక్‌కు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా ఈ-సిగరెట్ల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ గుర్తించింది. నిఘా వేసి.. భారీగా ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుంది. వీటి విలువ సుమారు మూడు లక్షల విలువ దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ-సిగరెట్ల విక్రయానికి పాల్పడుతున్న ఇండియన్ బిజినెస్ స్కూల్ విద్యార్థి మాధవను (19) పోలీసులు అరెస్ట్ చేశారు. ICFAi, IBS స్కూళ్లలో పదిమంది విద్యార్థులు, మహీంద్రా యూనివర్సిటీ, సంస్కృతి డిగ్రీ కాలేజ్, ఆకాష్ ఇన్స్టిట్యూట్, గీతం కాలేజ్ , అమిటీ కాలేజ్ విద్యార్థులకు ఈ సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. మాధవ్ నుంచి 22 ఈ-సిగరెట్ల తో పాటు రెండు మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. అమిటి కాలేజీలో చదువుతున్న అచ్యుత్.. 71 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు గుర్తించారు. వీళ్లిద్దరితో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
శిల్పా చౌదరి కేసు: ఆ డబ్బంతా బ్లాక్‌ను వైట్ చేసేందుకే ఇచ్చారా?
మణికొండ: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు గుంజిన శిల్పా చౌదరిని పోలీసులు శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను 2 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) శిల్పాచౌదరిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. తొలుత విచారణలో ఆమె పెద్దగా సహకరించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణాధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే ఆమె ఫోన్ కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లపై ప్రశ్నించడంతో విలపించినట్లు సమాచారం. చాలా మంది బ్లాక్‌మనీని వైట్ చేసేందుకు పెట్టుబడి రూపంలో ఇచ్చారని, మరికొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారని పోలీసులకు వివరించినట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టినది, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమాధానం దాటవేసినట్లు తెలిసింది. సంపన్నుల డబ్బును ఎగ్గొట్టే ఎత్తుగడను శిల్పాచౌదరి అమలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. శనివారం కూడా ఆమె విచారణ సాగనుంది. -
‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్‌ను ఎందుకు నియమించారో తనకు తెలియదని మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) సబ్ ఇన్స్పెక్టర్ షేక్ లాల్ మదార్ అన్నారు. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరిస్తే సిర్పుర్కర్ కమిషన్ నియమించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని కమిషన్ అడగ్గా, ఏమో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి, న్యాయపరంగా శిక్షిస్తే పోలీసులకు కీర్తి వచ్చేది కదా అని ప్రశ్నించగా.. తనకు తెలియదని పేర్కొన్నారు. ముద్దాయిల అరెస్టును ప్రజలు హర్షించారా అని అడగగా.. తనకు తెలియదని చెప్పారు. సిర్పుర్కర్ కమిషన్‌కు గురువారం లాల్మదార్ ఇచ్చిన వాంగ్మూలాలలో కీలకమైన అంశాలివీ.. లాంగ్ రేంజ్ వెపన్ ఎక్కడిది? ‘దిశ’సంఘటన సమయంలో మీరు సబ్ ఇన్స్పెక్టర్ కదా మరి లాంగ్ రేంజ్ (షోల్డర్) వెపన్ ఎలా ఉందని కమిషన్ ప్రశ్నించగా.. ‘‘దిశ సంఘటన కంటే రెండు రోజుల ముందు (2019 డిసెంబర్ 4) నేను నార్సింగి ఎస్ఓటీలో రిపోర్ట్ చేశాను. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి.. ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నన్ను లాంగ్ వెపన్ తీసుకురమ్మన్నారు’అని నాతో చెప్పాడు. నాతో పాటు వచ్చిన ఐదుగురు పోలీసులు ఆయుధాలు తీసుకోగా.. అక్కడ మిగిలింది ఏకే–47 ఒక్కటే. అందుకు అదే తీసుకున్నాను’’అని వివరించారు. ఎవరెవరు ఏ తుపాకులు తీసుకున్నారని ప్రశ్నించగా.. నాతో పాటు ఎస్ఐ బాలరాజు ఏకే–47 తీసుకోగా.. ఎస్.సుమన్, రవి, హెడ్ కానిస్టేబుల్ బండయ్య, సిరాజుద్దీన్ నలుగురు ఎస్ఎల్ఆర్లు తీసుకున్నారని తెలిపారు. విధి నిర్వహణలో తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఏకే–47 వినియోగించలేదని పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ వాళ్లు ఒత్తిడి చేశారు.. దిశ ఎన్‌కౌంటర్‌పై విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం ఆమన్‌గల్ ఎస్‌హెచ్‌వో కొండా నరసింహారెడ్డి లాగే తనను కూడా ఒత్తిడి చేసిందని త్రిసభ్య కమిటీకి వాంగ్మూలం ఇచ్చారు. నిందితులు ఎక్కడున్నారు? ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఎస్కార్ట్ పోలీసులు ఏ పొజిషన్లో ఉన్నారు? పంచ్ విట్నెస్లు ఎక్కడున్నారు.. ఇలా ఘటనకు సంబంధించిన అన్ని స్కెచ్లను ఎన్హెచ్ఆర్సీ సభ్యులే గీశారని, పైగా వాళ్లు చెప్పిన చోటే మార్కింగ్, సంతకాలు చేయాలని బలవంతం చేశారని వివరించారు. తాను నిరాకరించడంతో 9 గంటల పాటు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. దీని గురించి ఏసీపీ సురేందర్‌కు మాత్రం మౌఖికంగా తెలిపానని చెప్పారు. ఎన్కౌంటర్ మీ ఉద్దేశం కాకపోతే.. నిందితులను ఎన్కౌంటర్ చేయడం పోలీసులు ఉద్దేశం కాకపోతే ముద్దాయిల నడుము కింది భాగంలో కాల్పులు జరపాలి కదా అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ముందుగా నిందితులే ఫైరింగ్ ప్రారంభించారని, దీంతో వాళ్ల మైండ్ డైవర్ట్ చేయడానికి శబ్దం వచ్చిన వైపు ఎదురు కాల్పులు జరిపానని తెలిపారు. నిందితులు పోలీసుల తుపాకులు లాక్కొని ఎందుకు పరిగెత్తారని అడగగా.. తనకి తెలియదని చెప్పారు. ఆరీఫ్ ముందుగా ఫైరింగ్ చేయగానే అక్కడు న్న పోలీసులందరూ అక్కడున్న రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న గట్టు కింది భాగం లో రక్షిత ప్రదేశంలోనే పడుకున్నారు కదా.. మరి మీరెందుకు నిందితుల నడుము పైభాగంలో కాల్పులు జరిపారని త్రిసభ్య కమిటీ ప్రశ్నిం చింది. నలుగురు నిందితులు పారిపోతున్న ప్రాంతం తమ కంటే ఎత్తులో ఉందని, దీంతో కాల్పులు మాకు తగిలే అవకాశం ఉండటంతో ఎదురు కాల్పులు చేశామని వివరించారు. నా కళ్లల్లో కూడా మట్టి పడింది.. పారిపోయేందుకు ప్రయత్నించిన మహ్మద్ ఆరీఫ్‌ను.. అతడి వెనకాలే ఉన్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పట్టుకోవటానికి ప్రయత్నించలేదా? అని ప్రశ్నించగా.. హెడ్ కానిస్టేబుల్ జానకీరాం, ఎస్‌హెచ్‌వో నరసింహారెడ్డి కళ్లలో ఆరీఫ్ మట్టి విసరడంతో.. ఆ మట్టి తన కళ్లల్లోనూ పడిందని, దీంతో చూడలేకపోయానని సమాధానం ఇచ్చాడు. నిందితులు పారిపోతుండగా ఏసీపీ కాల్పులు జరపమని ఆదేశించగా.. 8–10 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపానని చెప్పారు. కాల్పులు జరిపిన పోలీసుల సెల్ఫోన్లు తీసుకున్నారు.. 2019 డిసెంబర్ 6న ఉదయం 7:59 నుంచి 8:02 గంటల వరకు చటాన్‌పల్లిలో ఉన్న మీ సెల్‌ఫోన్ నంబర్ టవర్ లొకేషన్ ఆ తర్వాత ఉదయం 9:49 నుంచి 11:55 గంటల మధ్య మహరాజ్‌పేట, సాయంత్రం 6:09 గంటలకు నార్సింగి, సాయంత్రం 6:11 గంటలకు గ్రేహౌండ్స్, 6:19 గంటలకు కొత్వాల్‌గూడలో ఆ తర్వాత శంషాబాద్‌లో ఎందుకు చూపించిందని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తాము ఫోన్లో మాట్లాడుతున్నామని చెప్పి తనతో పాటు సిరాజుద్దీన్, రవి, నరసింహారెడ్డిల సెల్ఫోన్లను షాద్‌నగర్ ఎస్హెచ్ఓ తీసుకున్నారని వివరించారు. తన ఫోన్‌కు లాక్ లేకపోవటంతో ఎవరైనా వినియోగించుకునే అవకాశముందని తెలిపారు. నేర నిరూపణలో సెల్‌ఫోన్ కీలకమని మీకు తెలియదా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
రాయదుర్గం: కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలి స్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీసీపీ విశ్వప్రసాద్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండటంతో కొంతమంది బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి పాన్‌డబ్బాలు, కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. సమాచారమందుకున్న ఎస్వోటీ, చందానగర్, ఆర్సీపురం పోలీసులు దాడులు చేశారు. 11 వాహనాల్లో తరలిస్తున్న గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 21 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 202 బ్యాగుల గుట్కా, పాన్ మసాలాను సీజ్ చేశామన్నారు. బీదర్‌కు చెందిన నాధ్ఖాన్, మాలిక్ దినేశ్, జావీద్, ఫారుఖ్, సాల్మన్, భరత్, పాష , షెమ్మి, బాబిర్ పటేల్, అసాన్పటేల్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుట్కా స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర వహిం చిన ఎస్వోటీ అడిషనల్ డీసీపీ దయానంద్‌రెడ్డి, చందానగర్, ఆర్సీపురం సీఐలు తిరుపతిరావు, రాంచందర్‌రావు, ఎస్ఓటీ సీఐలు పురుషోత్తం, ప్రవీణ్‌రెడ్డి, కానిస్టేబుల్, సిబ్బందిని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. -
‘కేటీపీఎస్’ నిర్మాణ పనులు ఆగొద్దు
మరింత వేగవంతం చేయాలి కాంట్రాక్ట్ కంపెనీలను ఆదేశించిన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచ : కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దని, ముందస్తు ప్రణాళికలతో చకచకా సాగేలా చూడాలని టీఎస్ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు ఆదేశించారు. ఆయన మంగళవారం స్థానిక కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలో కాంట్రాక్ట్ కో–ఆర్డినేష¯ŒS మీటింగ్(సీసీఎం) నిర్వహించారు. నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్తోపాటు అనుబంధ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు, జె¯ŒSకో డైరెక్టర్లు, కేటీపీఎస్ అధికారులతో మాట్లాడారు. విభాగాలవారీగా పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పనులు మందగిస్తున్నాయనే సాకు చెప్పొద్దని, అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘ప్రభుత్వం నుంచి మాపై ఒత్తిడి ఉంది. సీఎం కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి పనులు పూర్తిచేయాలి’’ అని చెప్పారు. పనులను జెన్కో, కేటీపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రతి వారం ప్రొగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం, 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. కూలింగ్ టవర్ నిర్మాణ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ, సచ్చిదానందం, సివిల్ సీఈ అజయ్, ఓ అండ్ ఎం సీఈ వి.మంగేష్ కుమార్; 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, ఎస్ఈలు నరిసింహ, ఎల్లయ్య, యుగపతి, బీహెచ్ఈఎల్, పవర్‌మెక్, పుంజులాయిడ్, ఎస్‌అండ్‌సీ, సంతోష్ పాల్గొన్నారు. నవంబర్‌లో ‘భద్రాద్రి’ పనులు ప్రారంభం కిన్నెరసాని (పాల్వంచ రూరల్): భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో (నవంబర్‌లో) ప్రారంభమవుతాయని జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ఆయన మంగâýæవారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి ప్లాంట్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. వచ్చే నెలలో పనులను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. కేటీపీఎస్ 7వ దశ, పులిచింతలలోని విద్యుత్ కర్మాగారాన్ని 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఇంజనీర్లతో కూడా ఆయన మాట్లాడారు. కిన్నెరసాని నీటి మట్టాన్ని గరిష్ట స్థాయిలో ఉంచుతున్నామని, దీని వలన డ్యామ్‌కు ప్రమాదం లేదని చెప్పారు. -
గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఎస్వోటీ పోలీసుల దాడి
అక్రమంగా గ్యాస్ నింపుతున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజు కాలనీలో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. -
హైటెక్ పద్దతిలో ఆర్ఆర్బి పేపర్ లీక్:34 మంది అరెస్ట్
హైదరాబాద్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 24 మందితోపాటు పరీక్ష రాసే 10 మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు. ఈ పరీక్షకు చైతన్యపురి, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్, సరూర్ నగర్‌లోని చైతన్య జూనియర్ కాలేజీ, తిరుమలగిరిలోని గౌతమి మోడల్ స్కూల్ కేంద్రాలుగా ఉన్నాయి. ఓ రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులు మెడలో తాయిత్తు రూపంలో డివైజ్, చెవిలో బ్లూటూత్‌తో మాస్ కాపీయింగ్ చేశారు. మాస్ కాపీయింగ్ చేస్తున్న పది మంది అభ్యర్థులను చైతన్యపురి, తిరుమలగిరిలలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 34 మందిని అరెస్ట్ చేశారు. ** -
డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎస్ఓటీ
ముగ్గురి అరెస్టు.. రూ.10 లక్షల ఎపిడ్రిన్ స్వాధీనం హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నుంచి ముంబైకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువైన ఎపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువులోని సన్ వే కెమికల్ ఫ్యాక్టరీ, ఖాజీపల్లిలోని ఎస్పీఎల్ కెమికల్ ఫ్యాక్టరీలలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న దమ్మిడి శ్రీనివాస్ (గుంటూరు జిల్లా), కోటిరెడ్డి, రాజేంద్రనగర్‌లో వ్యాపారం చేస్తున్న త్రిలోక్‌నాథ్ యాదవ్ స్నేహితులు. శ్రీనివాస్ పనిచేస్తున్న కంపెనీ రెండేళ్ల క్రితం మూసివేయడంతో అందులో ఉన్న ఎపిడ్రిన్ మత్తుమందును అతడు దొంగిలించి ఇంట్లో నిల్వచేశాడు. తర్వాత స్నేహితులతో కలిసి దానిని ముంబైకి, నగరంలోని పలు పబ్బులు, హుక్కా సెంటర్లకూ సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైకి డ్రగ్‌ను రవాణా చేసేందుకు రాజేంద్రనగర్ పీడీపీ చౌరస్తా వద్దకు వచ్చిన వీరు ముగ్గురినీ పోలీసులు పట్టుకున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా వీరు డ్రగ్స్ సరఫరా చేశారని, వీరి వెనక మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.