పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
హుజూర్‌నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.
హుజూర్‌నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బేతవోలు నుంచి పట్టణానికి నీటి సరఫరా జరిగే పైపులైన్ లీకేజీ వల్ల రహదారి ధ్వంసమైందన్నారు. పైపులైన్ మరమ్మతుల పేరుతో ప్రతిసారీ గుంతలు తీసి రోజుల కొద్దీ ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగరపంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అట్లూరి హరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య, చిలకరాజు లింగయ్య, అహ్మద్‌హుస్సేన్, బెల్లంకొండ గురవయ్య, కోల మట్టయ్య, ఆయూబ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరబాబు, శేఖర్, జాలగురవయ్య, నాగరాజు, సలీం, శ్రీనివాస్ పాల్గొన్నారు.