కేటీపీఎస్‌ 7వ దశను వేగవంతం చేయాలి | Speed up ktps 7th stage works | Sakshi
Sakshi News home page

కేటీపీఎస్‌ 7వ దశను వేగవంతం చేయాలి

Published Fri, Aug 19 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

7వ దశను పరిశీలిస్తున్న జెన్‌కో డైరెక్టర్‌ సి.రాధాకృష్ణ

7వ దశను పరిశీలిస్తున్న జెన్‌కో డైరెక్టర్‌ సి.రాధాకృష్ణ

  • జెన్‌కో డైరెక్టర్‌ రాధాకృష్ణ
  • పాల్వంచ: కేటీపీఎస్‌ 7వ దశ (800 మెగావాట్లు) నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని, పని ప్రదేశాల్లో మ్యాన్‌ పవర్‌ పెంచాలని టీఎస్‌ జెన్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) సి.రా«ధాకృష్ణ ఆదేశించారు. కేటీపీఎస్‌ 7వ దశ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అన్ని విభాగాలకు వెళ్లి పనుల నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ ప్రదేశంలో అనేకచోట్ల గుంతల్లో వర్షపు నీళ్లు నిల్వ ఉండడాన్ని గమనించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వర్షం వెలిసిన వెంటనే పని ప్రదేశంలో నీళ్లు లేకుండా చూడాలని ఆదేశించారు. పనులు కొన్నిచోట్ల నత్తనడకన నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముమ్మరం చేయాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనులు సాగించాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవదద్ని, అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఆయన వెంట ఓ అంyŠ lఎం; 5, 6 దశల సీఈలు వి.మంగేష్‌కుమార్, పి.రత్నాకర్, ఎస్‌ఈలు యుగపతి, బాలరాజు తదితరులు ఉన్నారు.


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement