
ఒంగోలు వన్‌టౌన్ : అద్దంకి మండలం జార్లపాలెంకు చెందిన పొగాకు బ్యారన్‌లో పని చేస్తున్న మహిళా కూలీలు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే పని ఉంటుందని మిగతా రోజుల్లో ఉపాధి అవకాశాల్లేక వలసలు వెళ్తున్నారని తెలిపారు.
రాజశేఖరరెడ్డిగా నామకరణం
పీసీపల్లి: కొరిశపాడు మండలం పిచికలగుడిపాడు గ్రామానికి చెందిన గాదె సునీత కుమారునికి రాజశేఖరరెడ్డిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేశారు. సోమవారం ప్రజా సంకల్పయాత్ర అలవలపాడు హైవే వద్దకు చేరుకోవడంతో ఆమె జగన్‌ను కలిసింది. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం తో పేరు పెట్టించినట్లు తెలిపింది.