ఇక రన్‌వేపై రయ్‌రయ్!
-
విమానాశ్రయ అభివృద్ధి పనులు షురూ
-
19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ
మధురపూడి :
రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులు మొదలయ్యాయి. వాటిని వేగవంతంగా పూర్తిచేయాలని ఎయిర్‌పోర్ట్స్‌అథారిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రూ.200 కోట్లతో రన్‌వే విస్తరణ, కాంపౌండ్‌వాల్ నిర్మాణం, ఐసోలేషన్ బే నిర్మాణం, తదితర అభివృద్ధి పనులను పూర్తిచేసేందుకు ఎయిర్ పోర్టుడైరెక్టర్ ఎం.రాజకిషోర్ ఆధ్వర్యంలో అంతా సన్నద్ధమయ్యారు. గతంలో చేపట్టిన యాఫ్రాన్ నిర్మాణ æపనులు సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
రైతు సమస్యల పరిష్కారానికి బహిరంగ సమస్య
అపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రపౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు, కేంద్ర సీనియర్‌మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహోపాత్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్‌ఎన్ చౌబే ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
సమస్యల పరిస్కారంకోసం ఎదురుచూపు
ఏడాది క్రితం విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి 857 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సంగతి తెలిసిందే. ఈ భూములకు సంబంధించిన పరిహారాన్ని కొందరు రైతులకు అందజేశారు. అయితే సుమారు 60 మంది రైతులు తమకు పరిహారం అందలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ తరహా సమస్యలు విమానాశ్రయ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లు జరుగుతున్నట్టు రైతులు ఆశిస్తున్నారు.