వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం జరిగిన ర్యాలీలో రూ 550 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఓల్డ్ కాశీలో సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం వంటి పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. బెనారస్ వర్సిటీలో ప్రాంతీయ ఆప్తాల్మజీ సెంటర్ వంటి పలు కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు.
వారణాసి నగర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ పనులతో కాశీ సహా పరిసర ప్రాంతాల రూపురేఖలు మారతాయని ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వారణాసిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పరమేశ్వరుడికి వదిలివేశాయని ఆక్షేపించారు. తాను వారణాసి ఎంపీ కాకముందు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా విద్యుత్ స్తంభాల నుంచి తీగలు వేలాడుతుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment