inaugurations
-
పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు నియోజకవర్గాల్లో మరో రెండేళ్లలో మురుగు అవస్థలు తీరనున్నాయి. మూసీకి ఉత్తరం వైపున మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. జలమండలి పరిధిలో జోన్– 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మురుగు తిప్పలు తప్పనున్నాయి. సుమారు రూ.297 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. పాతనగరంలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ (ముంబై) రూపొందించింది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. ► జోన్– 3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్ 1 నుంచి ఎన్ 7 వరకు, ఎన్ 11, ఎన్ 31 పరీవాహక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ ఉంది. ►ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.297 కోట్లు. ►నెట్వర్క్ మొత్తం పొడవు: 129.32 కి.మీ. ► ఆర్సీసీ ట్రంక్ సీవర్స్ పైప్లైన్లు: 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ. ►ఎస్‌డబ్ల్యూజీ నెట్వర్క్ 200–300ఎంఎం డయా: 93.18 కి.మీ. ►మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి: 127.42 ఎంఎల్డీ. ► 2051 నాటికి : 153.81 ఎంఎల్డీ. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్ (కొంత భాగం), మెహిదీపట్నం, నానల్‌నగర్, ఆసిఫ్ నగర్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్. ప్రయోజనాలు: సీవరేజీ వ్యవస్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సివరేజ్ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ మేం జీతాలు పెంచాం.. మోదీ ధరలు పెంచారు బహదూర్‌పురా: పాతబస్తీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మీరాలం ట్యాంక్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీంతో వారు తమ జీతాలు పెంచాల్సిందిగా ఆయనను కోరారు. స్పందించిన కేటీఆర్.. రాష్ట్రం వచ్చేనాటికి రూ.8 వేలున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని సీఎం కేసీఆర్ దఫదఫాలుగా రూ.17 వేలకు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని వారు చెప్పగా, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. మేం జీతాలు పెంచుతూ ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సివరేజీ పనులకు శ్రీకారం గోల్కొండ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకిలో రూ. 297 కోట్లతో చేపట్టిన సివరేజీ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సివరేజ్ లైన్ పనులు పూర్తయితే ఎన్నో బస్తీలకు వరద ముంపు తప్పుతుందన్నారు. షేక్‌పేట్‌లో రూ. 333 కోట్లతో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. సెవన్ టూంబ్స్ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు రోప్‌వే కోసం ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాము ప్రతిపాదించిన పనులకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మహ్మద్ నసీరుద్దీన్, రాషెఫ్ ఫరాజుద్దీన్, టీఆర్ఎశ్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి టి.జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
వారణాసి రూపురేఖలు మార్చేస్తాం : మోదీ
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం జరిగిన ర్యాలీలో రూ 550 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఓల్డ్ కాశీలో సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం వంటి పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. బెనారస్ వర్సిటీలో ప్రాంతీయ ఆప్తాల్మజీ సెంటర్ వంటి పలు కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. వారణాసి నగర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ పనులతో కాశీ సహా పరిసర ప్రాంతాల రూపురేఖలు మారతాయని ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వారణాసిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పరమేశ్వరుడికి వదిలివేశాయని ఆక్షేపించారు. తాను వారణాసి ఎంపీ కాకముందు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా విద్యుత్ స్తంభాల నుంచి తీగలు వేలాడుతుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. -
మన గురుకులాలే ఆదర్శం
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురుకులంలో డార్మెటరీ హాల్ ప్రారంభం సిద్దిపేట రూరల్: మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మిట్టపల్లి, ఎల్లుపల్లి గురుకులాలు ఆదర్శమని కొనియాడారు. ఆది వారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మెటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్ ల్యాబ్, క్లాస్ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... మిట్టపల్లి, ఎల్లుపల్లి గురుకులాల్లో డార్మిటరీ హాల్ ను రూ.5.50కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా నిర్మించినట్టు చెప్పారు. పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావుకు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పలు విన్యాసాలతో అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఎర్ర యాదయ్య, మాణిక్యరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు కోటగిరి శ్రీహరిగౌడ్, సర్పంచ్‌లు సిద్దరబోయిన రాజ్యలక్ష్మి శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతీ, నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పుల్లూర్ బండపై మొక్కలు నాటిన మంత్రి మండలంలోని పుల్లూర్ బండ శ్రీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు మొక్కలు నాటారు. ‘జనం కోసం వనం... వనం కోసం మనం’ నివాదంతో ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు పుల్లూర్ బండపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదయ్య, సర్పంచ్ సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేశ్, ఆలయ అర్చకులు రంగాచారి, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ ఆధ్వర్యంలో... సిద్దిపేట ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పుల్లూర్ గ్రామ శివారులో ఈత మొక్కలను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ గీత కార్మికులతో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేశ్, ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలతోనే మనుగడ చిన్నకోడూరు: మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. భావితరాలకు ఫలవంతమైన మనుగడను వనాల అభివృద్ధి ద్వారా సాధించ వచ్చన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం 33 శాతం ఉండగా, మన జిల్లాలో 6 శాతం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా జిల్లాలో ఆశించిన వర్షాలు కురవడం లేదన్నారు. అతివృష్టి, అనావృష్టిని, భూమికోతను కాపాడేది చెట్లేనన్నారు. పర్యావరణ సమతుల్యతకు, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇచ్చేందుకు మొక్కలు పెంచాల్సిందేనన్నారు. వరుస కరువు వల్ల వ్యవసాయం మూలన పడిందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు చెట్లు పెంచితే భవిష్యత్తు ఉంటుందన్నారు. అందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వంద శాతం పూర్తి చేసి సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో మొక్కలు నాటాలన్నారు. అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం, ఓఎస్డీ బాల్‌రాజు, వెటర్నరీ ఏడీ అంజయ్య, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ జాఫర్, సర్పంచ్‌లు మేడికాయల వెంకటేశం, మెట్ల శంకర్, ఎంపీటీసీలు బాలదుర్గవ్వ, ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
అభయహస్తం తప్పుడు సంకేతం!
అక్షర తూణీరం ‘‘ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇంతా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొకడు. ఒకవైపు సర్వత్రా దసరా ఉత్స వాలు, ఒక దిక్కు బ్రహ్మాండ నాయ కుని బ్రహ్మోత్స వాలు, మరోవైపు అమరావతి మహానగర శిలా న్యాస సంరంభం - ఆంధ్రప్రదేశ్ ప్రజని బూరెలగంపలో కూచో పెట్టినట్టయింది. చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. అప శ్రుతులు దొర్లకుండా కార్యక్రమాన్ని జరిపిం చారు. ప్రజల్లో ఉత్సాహం నింపారు. ‘‘ప్రధానమంత్రి ఏమీ అభయహస్తం ఇవ్వ లేదే’’ అని ఒకాయన చప్పరించారు. ఎలా ఇస్తాడండీ, అభయహస్తం? అపోజిషన్ సిం బల్ కదా! అని పక్కాయన సమర్థించాడు. ఏమీ ఎరగనట్టు, ఏమీ పట్టనట్టు ఆ మహా జనం మధ్య తిరుగుతూ ఉంటే రకరకాల మాటలు, విసుర్లు, చెణుకులు, ఆశలు, నిరాశలు, నిట్టూర్పులు వినిపించాయి. ఎంతైనా కె.సి.ఆర్. రావడం వల్ల సభ నిండుగా ఉందన్నారు చాలా మంది. ‘‘అం తేగా, మనం పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేసినా తోబుట్టువు రాలేదనుకో శుభకార్యం వెలా తెలా పోదూ’’ అని వత్తాసు పలికారు ఇం కొందరు. ‘‘ఈసారి ఇక్కడెందుకో అన్నగారి జోక్యం తగ్గించినట్టు కనబడుతోంది’’ అన్నా డొక రైతు. ‘‘నీది మరీ చోద్యం. ఇదేమన్నా మహానాడా... అన్నగారి బొమ్మలు పెట్టడా నికి’’ ఖండించాడు ఇంకో పెద్ద రైతు. ‘‘ఎన్నై నా చెప్పండ్రా, మన చంద్రబాబు మంచి పనివాడురా’’ అని ఒకాయన కాంప్లిమెం టు. ‘‘పనోడు కాపోతేనే అంతపని చేస్తాడం ట్రా’’ మరొకాయన రివర్స్ సప్లిమెంటు. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ మట్టిలో ఏ మహిమ ఉందో! అన్ని చోట్ల నించి మట్టి తేవడం మంచిదే కాని, ప్రధాని మోదీ ఇం తా చేసి ముంతెడు మట్టి తెచ్చాడంటే మాత్రం బాలేదురా’’ అన్నాడొక వయసు మళ్లిన స్థానికుడు. ‘‘ఏంటి బాబాయ్, కొత్త పట్టుపంచెలు కట్టుకురాలేదే’’ ఒక ప్రశ్న. దాచిందిరా మీ పిన్ని. ఇప్పుడెందుకులే, గృహప్రవేశానికి కట్టుకుంటే పద్ధతిగా ఉం టుందని చెప్పింది. ‘‘ఏంటి! అమరావతి గృహప్రవేశానికా... అబ్బో అయినట్టే’’ అన్నాడో గొంతు వెటకారంగా. ‘‘నవ్విన నాపచేనే పండుద్దిరా’’ అన్నాడు తిరిగి రోషంగా. ‘‘అది సామెతలే బాబాయ్... నాపచేను పండటం చూశావా’’ అంటూ తిరగబడ్డాడు. ‘‘నాకు బాస రాదుగాని, ఆయన చెప్పిందే మన వెంకయ్య చెప్పాడా, వేరే ఏమన్నా సొంతంగా చెప్పాడా’’ అని పక్క వాడి చెవి కొరికాడొకాయన. ‘‘ఆయన మాటలే ఈయన మాటలు’’. ‘‘ఎవరే బాసలో, ఎవరేం మాట్టాడినా వెంకయ్య తన ఆలోచనలో వినిపిస్తాడని డౌటేసి అడి గాలే’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఔను గాని ఒరే, బాలకృష్ణ స్పీచి దేనికిరా అక్కడ. బాగా కామెడీగానే ఉందనుకో...’’ అని ఒకాయన సందేహం వెలిబుచ్చాడు. ‘‘చంద్రబాబుకి బాగా వాస్తు పిచ్చంట గదరా’’ అని ఒక పెద్దాయన సందేహం వెలిబుచ్చాడు. ‘‘పిచ్చేంటి, నమ్మకం. అప్పట్లో, ఇల్లు నిన్ను దెబ్బతీస్తుంది. రెండు గుమ్మాల్ని అర్జం టుగా మార్పించమని మామగారి చెవిలో ఇల్లు కట్టుకు చెబితే ఎన్టీఆర్ పెడచెవిన పెట్టాట్ట. ఏమైంది చివరికి... అందుకే బాబుకి పిచ్చి నమ్మకం’’ అని క్లారిఫై చేశా డొక టీడీపీ కార్యకర్త. ఔన్లేరా, ఇక్కడే తెలు స్తోందిగా. కేసీఆర్‌తో భుజం మీద చేతులు వేసుకు తిరుగుతున్నాడంటే, మరి ఈ నేలపై ఏదో పవరున్నట్టేగా? ‘‘ఇవన్నీ సరేగాని, మన సీయమ్ చెబు తున్న నవ నగర నగరం వస్తుందం టావా...’’ అని ఒక పెద్దాయన నీరసంగా అడగడం వినిపించింది. అవతల భోజనాల సందడి మొదలైంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)