వ్యవసాయ యాంత్రీకరణకు రూ.24కోట్లు | 24crors to agriculture technical devolopment | Sakshi

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.24కోట్లు

Published Mon, Jul 18 2016 12:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మాట్లాడుతున్న జేడీఏ మణిమాల - Sakshi

మాట్లాడుతున్న జేడీఏ మణిమాల

నేలకొండపల్లి : జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు జిల్లా వ్యవసాయ సంచాలకురాలు మణిమాల తెలిపారు. నేలకొండపల్లిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయం తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రైతులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టులో పంపిణీ చేస్తామని అన్నారు. పసల్‌ బీమాను పత్తికి 5000 మంది రైతులు, మిర్చికి 6000 మంది రైతులు చేయించుకున్నారని అన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, 30వేల టన్నులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 22న వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ డే ఘనంగా నిర్వహిస్తామన్నారు. అదే రోజు 19లక్షల మొక్కలను నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్త్రత్తలు తీసుకోవాలని, బిల్లులు ఇవ్వకపోతే వెంటనే వ్యవసాయ శాఖ కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement