‘అభివృద్ధి నినాదంతో ముందుకెళతాం’ | BJP To Fight 2019 LS Polls On Development And Governance  | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధి నినాదంతో ముందుకెళతాం’

Published Fri, Apr 27 2018 7:23 PM | Last Updated on Fri, Apr 27 2018 7:24 PM

BJP To Fight 2019 LS Polls On Development And Governance  - Sakshi

రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, కాన్పూర్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి, సుపరిపాలనే ప్రచారాంశాలుగా బీజేపీ బరిలో దిగుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధే తమ ప్రధాన నినాదంగా ఉంటుందన్నారు. వచ్చే నెలలో జరిగే కైరానా లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ హుకుం సింగ్‌ మరణంత ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 28న కైరానా పార్లమెంట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రధాని చైనా పర్యటనను ప్రస్తావిస్తూ చైనాతోనే కాక ఇరుగుపొరుగు దేశాలన్నింటితో మెరుగైన సంబంధాలను భారత్‌ కోరుకుంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement