పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
Published Tue, Aug 23 2016 12:47 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
కాజీపేట రూరల్ : క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో సోమవారం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నాయకులు, మండలాల పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేటి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు ఆంజనేయులు, ఖాసీం, జంప య్య, సిరికొండ చారి, రమేష్, సంపత్, రాజు, హరికృష్ణ, అప్పం కిషన్, పసునూరి ప్రభాకర్, కమలాకర్‌రెడ్డి, అశోక్, రవి పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాను విడదీయెుద్దు
నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ఎంతో చారిత్రకమైన వరంగల్ జిల్లాను విడదీసే యోచనను మానుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నుంచి హన్మకొండను మార్చుతూ జిల్లాగా ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ, హృదయ్ పథకాలకు ఎంపికైన వరంగల్‌ను విడదీస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. సమావేశంలో నాయకులు కమలాకర్‌రెడ్డి, రజనీకాంత్, హరికృష్ణ పాల్గొన్నారు.
Advertisement